షడ్రుచుల మేళవింపు.


"ఉగాది" మన తొలి పండుగ. కొత్త ఆశలతో, కొంగ్రొత్త ఊహలతో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే రోజు. ఆరు రుచుల మేళవింపుతో మనం ఆస్వాదించే పచ్చడి మనకు జీవితంలో కష్టసుఖాలు , ఆటుపోట్లు అన్నీ ఉంటాయని వాటిని అన్నింటినీ సమంగా స్వీకరించాలని అంతరార్ధం ఇమిడి ఉంది. ఉగాది పచ్చడి లోని తీపి మనకు జీవితంలో మంచి మంచి అనుభవాలను, గుర్తుచేస్తుంది. చేదు వాటితో పాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయని తెలుపుతుంది. పులుపు, వగరు, కారం, ఉప్పు మొదలైన రుచులన్నీ నాలుకకు తగిలీ తగలనట్లు రుచికి వేస్తాం. ఇవన్నీ మన జీవితంలో అలా అలా వచ్చిపోతుంటాయని సూచిస్తాయి. జీవితం అంటేనే వెలుగునీడల సయ్యాట. దేనినైనా మనం సమానంగానే స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అందరికీ "జయ" నామ సంవత్సరానికి స్వాగతం , సుస్వాగతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం