అ.భా.భా.బా.సం


       ఫోటొ చూసారు కదూ! అది నేనేదో పాత పుస్తకాలు సర్దుతుంటే చూసాను. ఎక్కడో నార్త్ లో భార్యాబాధితసంఘం వాళ్ళట . వారి కష్టాలను ఏకరువు పెడుతూ, రాలీ నిర్వహించారట. ఫ్లెక్సీని పట్టుకొని ఊరేగుతూ. ఇది చూసి నాకు ఒక విషయం చెప్పాలని ఉంది.
       అనగనగా ఒక రాజు గారికి తన సభలో భార్యాబాధితులు ఎంత మంది ఉన్నారో తెలుసుకొని వారితో ఒక సంఘం ఏర్పాటు చేయాలనుకొన్నాడు. సభ లోని వారందరినీ భార్య అంటే భయం ఉన్నవాళ్ళు తన కుడివైపు గదిలోనికి, భయం లేని వాళ్ళని ఎడమవైపు గదిలోనికి వెళ్ళమని ఆదేశించాడు. చాలా మంది పాపం కుడివైపు గదిలోనికి వెళ్ళారు. కొద్దిమంది మాత్రం ఎడమవైపు గదిలోకి వెళ్ళారు. ఒకడు మాత్రం కదలకుండా కూర్చున్నాడు. రాజు అడిగాడు. నువ్వు గదిలోకి వెళ్ళలేదేమని. అందుకు అతను నా భార్య చెప్పందే పని చేయనండి. అందుకే గది లోకి వెళ్ళలేదు అన్నాడు. రాజు వెంటనే భార్యా బాధితుల సంఘానికి అతనినే అధ్యక్షునిగా ప్రకటించాడు. ఇంతలో ఒక భటుడు వచ్చి రాజుగారి చెవిలో ఏదో చెప్పాడు. రాజు కంగారుగా సభ చాలించి అంతఃపురానికి బయలుదేరాడు. రాణి గారు పిలిచిన వెంటనే వెళ్ళకపోతే ఏమవుతుందో అని కంగారుగా, తన కిరీటం తీసి నిన్నటి బొప్పిని తడుముకుంటూ.
మా ఊరిలో కూడా .భా.భా.బా.సం శాఖ ఒకటి పెట్టేరు. అదేనండీ అఖిల భారత భార్యా బాధిత సంఘం . మీరు ఎవరికీ , ముఖ్యంగా నా భార్యకు చెప్పనంటే మీకొక విషయం చెప్తాను. మా ఊరి శాఖకు అధ్యక్షుడిని నేనే. ఉండండి మా ఆవిడ పిలుస్తోంది. మళ్ళీ కలుద్దాం బై.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం