పోస్ట్‌లు

జనవరి, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

మన దేశం లోని ప్రముఖ సూర్య దేవాలయాలు.

చిత్రం
మన భారత దేశంలో సూర్యునికి గల దేవాలయాలలో ప్రముఖమయినది ఒరిస్సాలోని కోణార్క్ దేవాలయం . దేవాలయాన్ని చూడండి .   శిల్పకళ ఎలా ఉట్టి పడుతోందో . ఇది దేశం లోనే అతి పురాతన సూర్య దేవాలయం . గుజరాత్ నందున్న మోదెరాలో కూడా ఒక సూర్య దేవాలయం ఉంది . చూడండి . మన రాష్ట్రంలో శ్రీకాకుళం లోని అరసవిల్లి సూర్యదేవాలయం కూడా ప్రసిద్ధి పొందినదే .   ఇది మనకు దగ్గరలోని పెద్దాపురం వద్ద ఉన్న పాండవుల మెట్ట మీద ఉన్న సూర్యదేవాలయం . మనకు పక్కనే ఉన్న పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడ లో కూడా సూర్యదేవాలయం ఉంది . చూడండి .   మన నగరంలో ప్రముఖ సెంటర్ ఏది అని అడిగితే అందరూ చెప్పేది భాను గుడి సెంటర్ అంటారు . మరి ఆ పేరు అక్కడ ఉన్న భానులింగేశ్వరస్వామి దేవాలయం వలనే అది కూడా సూర్యదేవాలయమే .  ( ఫోటోలు గూగులమ్మ సౌజన్యంతో )

రధసప్తమి వెనుక శాస్త్రీయ కోణం 2

సూర్యుడు ఒక్కో రాశి లోనూ లేదా ఒక్కో నెలలోను ముప్పై డిగ్రీలు చొప్పున మూడు వందల అరవై డిగ్రీలు పూర్తి   చేయడానికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై అయిదు రోజులు పడుతుంది . అది భూమి సూర్యుని చుట్టూ   ఒకసారి భ్రమణం చేయడానికి పట్టే సమయంగా గుర్తించవచ్చును .         అంతే కాక సూర్యుడు దక్షిణాయనం నుంచి మకర సంక్రాంతి నాడు ఉత్తరాయణం లోకి ప్రవేశిస్తాడు . ఇక్కడి నుంచి ఋతువులలో మార్పులు వస్తాయి . భూబ్రమణ ఫలితంగా సూర్యుడు దక్షిణార్ధ గోళం నుంచి ఉత్తరార్ధ గోళం వైపు కదలటం కన్పిస్తుంది . నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి . అందుకే రైతులు మరల తమ పొలం పనులలో నిమగ్నమయేందుకు సిధ్ధమవుతారు . విజ్ఞానశాస్త్ర ప్రకారం చూస్తే సూర్యోదయ కాలంలో సూర్యుని ఎదురుగా నుంచుని స్నానం చేయడం వలన సౌరశక్తి లోని అతినీల లోహిత కిరణాలు మన శరీరంలో విటమిన్ " డి " సంశ్లేషితమవుతుంది . లేత సూర్యకిరణాలలో సూర్య నమస్కారాలు చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం అదే .         జిల్లేడు , రేగు ఆకులకు సూర్యుని నుండి కాంతిని ఎక్కువగా గ్రహించే లక్ష

మయూరము

చిత్రం
మన దేశ జాతీయ పక్షి నెమలి అని అందరికీ తెలుసు కదా ! మరి నెమలిని జాతీయ పక్షి గా ఎప్పుడు ప్రకటించారో తెలుసా ? నెమలిని మన దేశ జాతీయ పక్షిగా     1963  జనవరి   31  తేదీన మన దేశ ప్రభుత్వం ప్రకటించింది . పక్షులలో నెమలి అందమే వేరు కదా !               మగనెమలిని మయూరం అంటారు . ఆడ నెమలిని మయూరి అంటారు . నెమలికి పొడవైన మెడ , తల పైన కిరీటం వలే ఉన్న నిర్మాణం , నీలపు రంగు ఛాతీ , పెద్ద పెద్ద కన్నులు కలిగి వెనుక భాగంలో పొడవైన తోక కలిగి ఉంటుంది . నెమలి రాజసానికి , దర్పానికి గుర్తుగా ఉంటుంది . దీని తోకలో పొడవైన ఈకలుంటాయి వాటికి చివర కన్నులుంటాయి . ఇవే మన చిన్నపుడు పుస్తకాలలో దాచుకున్న నెమలి కన్నులు . ఆకాశం మేఘాలు పట్టి వర్షం కురవటానికి సిధ్ధంగా ఉన్నపుడు నెమలి పులకించి నాట్యం చేస్తుంది . అది చూడటానికి రెండు కళ్ళు చాలవు .         బాగా నాట్యం చేసేవారిని " నాట్యమయూరి " అంటారు కదా ! ఇంతకీ నాట్యం చేసేది ఆడ నెమలి   కాదు . మగ నెమలి ఆడనెమలిని ఆకర్షించేప్రయత్నము అది . అందుకే పురి విప్పి నాట్యం చే

రధసప్తమి వెనుక శాస్త్రీయ కోణం

        రధసప్తమి అనేది   సూర్యుని   ఆరాధించే పండుగ . అనాదిగా మానవునికి ప్రకృతిశక్తులను ఆరాధించే ఆచారం ఉంది . అగ్ని , వాయువు , జలము , భూమి , చెట్లు , ఆకాశం మొదలైన వాటితో పాటు సూర్యున్ని కొలిచేవాడు . కారణం ప్రకృతిలో నిత్యం తాను చేసే పనులన్నింటికీ వీటితో సంబంధం ఉండటమే . పంటలు పండించడానికి , ఆహార సంపాదనకు , క్రూరమృగాల బారి నుండి రక్షించుకోడానికి ఇలా ప్రతీదానికి అగ్ని దేవుడు , వాయుదేవుడు , వరుణదేవుడు అందరి సహకారం కావాలని కోరుతూ వారికి పూజలు చేసేవారు . తమ నిత్య   జీవన   గమనాన్ని ఇవన్నీ నిర్దేశిస్తాయని భావించారు . వారికి ఆగ్రహం కలగటం వల్ల అకాల వర్షాలు , వరదలు , భూకంపాలు , మొదలైన ప్రకృతి భీభత్సాలు కలుగుతాయని భయపడేవారు .         ఖగోళశాస్త్రం ప్రకారం చూస్తే సూర్యుని సంచారానికి కూడా సంబంధం ఉందని చెప్పవచ్చును . సూర్యుని రధానికి గుర్రాలు ఏడు . ఇవి ఇంద్రధనుస్సు లోని రంగులుగా , లేదా వారం లోని ఏడు రోజులుగా భావించవచ్చును . సూర్యుని రధచక్రాలకు గల ఆకులు పన్నెండు . వీటిని ఒక సంవత్సరం లోని పన్నెండు నెలలుగా లేదా పన్నెండు

రధ సప్తమి గురించి మరికొన్ని విశేషాలు...

చిత్రం
రధ సప్తమి నాడు సూర్యోదయాన్నే ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నుంచుని తలపై ఏడు జిల్లేడు ఆకులు ( అర్క పత్రం ) , ఏడు రేగు ఆకులు లేదా రేగి పళ్ళు ఉంచుకొని స్నానము చేస్తారు . ( సూర్యునికి అర్కః అన్న పేరు ఉన్నది . అందుకే అర్క పత్రము ప్రీతి అంటారు ) . స్నానము చేస్తూ ఈ క్రింది శ్లోకం పఠిస్తారు . " యత్యత్ జన్మ కురుమే పాపం మయా సప్తమ జన్మాసు , తన్మే రోగంచ , శోకంచ , మా కరేహంచు సప్తమీ ..... " అని పఠిస్తారు . ఈ విధంగా చేయడం వల్ల ఏడు జన్మల పాపాలను ( ఈ జన్మలో చేసినవి , జన్మాంతరంలోనివి , తెలిసి చేసినవి , తెలియక చేసినవి , మానసికంగా చేసినవి , వాచికంగా చేసినవి , శారీరకంగా చేసినవి . ) , ఏడు రకాల రోగాలను తొలగిస్తాడని భావిస్తారు .         రధసప్తమి నాడు సూర్యుడు సప్తాశ్వములను పూన్చిన బంగారు రధం మీద రధసారధి అరుణుడు ( ఇతనికే అనూరుడు అనగా ఊరువులు లేనివాడు అని కూడా పేరు ఉన్నది ) తోలుతుండగా దక్షినాయనం నుంచి ఉత్తారాయనానికి మరలి వెల్తాడని భావిస్తారు . చిక్కుడు కాయలతోచేసిన రధం పూజలో వాడతారు . సూర్యునికి