తస్మాత్ జాగ్రత్త.

చూసారు కదా! మనకు చేతిలో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని  అవసరం లేని వాళ్ళు కూడా వాడితే ఏం జరుగుతుందో . డ్రైవింగ్ కాని ఓటు కి కాని ఇలా అన్నింటికీ వయసు నిబంధన పెట్టడం అనేది వయసుకు కొంత మానసిక పరిణితి వస్తుందని. రోడ్డు పైన పదేళ్ళు కూడా లేని వాళ్ళు బండి నడుపుతున్నారు అన్నా, ఇలా ఫేసుబుక్ , నెట్ వంటివి వాడుతున్నారు అన్నా వాళ్ళది కాదు తప్పు. తలితండ్రులదే. మా వాడు పెద్ద బండి నడిపేస్తాడు తెలుసా ? అంటూ గొప్పలు చెప్పుకోవచ్చు అనుకొంటారు. ఏదో ఒక ప్రమాదం జరిగేవరకూ సరదాగానే ఉంటుంది. అప్పుడు మాత్రం గొల్లు మంటారు. అదేవిధంగా నెట్ వాడకం కూడా పదో తరగతి చదివే వాడికి ఫేస్ బుక్ అవసరమా. తలితండ్రుల నియంత్రణ లేకపోవడం ఇటువంటి అనర్ధాలకు కారణం.   


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం