పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎరక్కపోయి చేసాను ఇరుక్కుపోయాను.

నేను మూడో తరగతి అనుకుంటా చదువుతున్నాను . రామారావుపేట మున్సిపల్ స్కూల్లో .  దానినే ఇసకతిప్ప స్కూల్ అనేవారు . అప్పుడు ఈశ్వరపుస్తక భాండాగారం , స్కూల్ మాత్రమే ఉండేవి . ప్రహారీ కూడా ఉండేది కాదు. స్కూల్ లోపల , బయట అంతా ఇసుక ఉండేది .  మేము రామారావుపేట శివాలయం ఎదురు వీధిలో ఉండేవాళ్ళం . ఇంటికి తాతగారో ఎవరైనా చుట్టాలో వచ్చినపుడు అయిదు పైసలో , పది పైసలో పిల్లల చేతిలో పెట్టేవారు . ( అపుడు ఒక పైసా , రెండు పైసలు , మూడు పైసలు , అయిదు , పది , ఇరవై పైసల బిళ్ళలు ఉండేవి లెండి వాటికి విలువ కూడా ఉండేది ). ఎవరైనా మన చేతిలో డబ్బులు పెట్టడం ఆలశ్యం . అవి వీధి చివర సత్యం కిళ్ళీకొట్టులో బిస్కట్లుగా గాని బిళ్ళలుగా గాని రూపాంతరం చెందేవి . అప్పడప్పుడు స్కూల్ దగ్గర దుంపలుగా కూడా ఖర్చు అయేవి . పాపం మా అమ్మ మాకు డబ్బులు జాగ్రత్త చెప్పాలని దేముడి దగ్గర ఒక చిన్న చెంబు పెట్టి ఎవరైనా డబ్బులు ఇస్తే దానిలో వేయాలని చెప్పేది . అలాగే వేసేవాళ్ళం . రోజూ ఒకసారి ఆ డబ్బులు ఉన్నాయో , లేవో అని చూసేవాళ్ళం . ఎవరూ తీసేవాళ్ళు కాదు . నాల

మరల చదవండి ..... మనసు పలికే మౌనరాగం

ఈ రోజు ఈనాడు దినపత్రికలో ఆన్ లైన్ లో హుషారు .. అంగట్లో బేజారు అంటూ వ్రాసిన ఆర్టికల్ చూడండి . నేను 24-02-14 న వ్రాసిన మనసు పలికే మౌనరాగం పోస్ట్ తదుపరి జరిగేది ఇదే . నేటి యువత ఆన్ లైన్ ప్రపంచం లో విహరిస్తూ నిజజీవితంలో చాలా కోల్పోతున్నారు అనటానికి ఉదాహరణ ఇదే . తప్పక చదవండి. 28-02-14 ఈనాడు దినపత్రిక

వంటెద్దు బండి.

       శివరాత్రి అనగానే అందరికీ శివుడు గుర్తువస్తాడు . నాకు సామర్లకోటలో భీమేశ్వరాలయానికి తెల్లవారుఝామున వంటెద్దుబండిలో వెళ్ళడం గుర్తుకు వస్తుంది . మా తాతగారిది సామర్లకోట . మేము ఏ ఊరులో ఉన్నా శివరాత్రికి సామర్లకోట వెళ్ళేవాళ్ళం . నేను బాగా చిన్నవాడిని . మా తాతగారి ఇంటికి ముందురోజు వెళ్ళేవాళ్ళం . ఆయన మామూలుగానే తెల్లవారుఝామున మూడు గంటలకి లేచి పొయ్యి వెలిగించి నీళ్ళు కాచేవారు . ఇంక అప్పటినుంచి అందర్నీ లేపడం మొదలుపెట్టేవారు . అందుకే ఆ అలవాటు అయిపోయే మీకు తెల్లవారకుండా పేపర్ వాడి కంటే ముందు నా పోస్ట్ పంపడం జరుగుతోంది . సరే ఇంక శివరాత్రి అంటే ఏ రెండు , మూడు అయేసరికి ఒక వంటెద్దు బండి వాడు వచ్చి గుమ్మం ముందుండేవాడు . అందర్నీ లేపేసి , భీమేశ్వరాలయానికి స్నానాలకి తీసుకుపోయేవారు . అప్పటికి నాకు నాలుగు , అయిదేళ్ళు ఉండేవి అనుకుంటా . ఆ గతుకుల రోడ్డు మీద వంటెద్దు బండిలో ప్రయాణం . అసలే నిద్ర మత్తు దానికి తోడు   గతుకుల్లో పడటం , రాళ్ళు ఎక్కడం జరిగినపుడల్లా అటూ ఇటూ తూలుతూ ఉండేవాళ్ళం . మూడు , నాలుగు కిలోమీటర్ల ప్ర

ఒకే టికెట్ట్ పై రెండు సినిమాలు చూసారా?

       కుటుంబం అంతా కలిసి సినిమాకు వెళ్తే వెయ్యి రూపాయలకు తక్కువ అవదు ఈ రోజుల్లో కదా ! మా చిన్నపుడు మా ఊరులో ఒక టూరింగ్ టాకీస్ ఉండేది . దాని పేరు లక్ష్మీగణపతి టూరింగ్ టాకీస్ . అంటే పెద్దబిల్డింగ్ అది ఊహించుకోకండి . చుట్టూ మట్టి గోడలు పైన రేకులు ఉన్న హాల్ అన్నమాట . పగలు సినిమా వేయటానికి కుదరదు ఖాళీలలోంచి వెలుతురు వచ్చేసేది . కాబట్టి ఏమి వేసినా రాత్రి మాత్రమే వెయ్యాలి . అందులో వారానికి ఒక సినిమా మారుతుండేది . రోజుకు రెండు ఆటలు మాత్రమే . అందులో ఎన్ని సినిమాలు చూసామో . అప్పుడప్పుడు ప్రత్యేక ఆఫర్ ఇస్తుండే వారు . అదేమిటంటే ఒకే టికెట్ పై రెండు సినిమాలు . అలా వచ్చిన సినిమాలు మాత్రం వదిలేవాళ్ళం కాదు . మా ఇంట్లో నేనే కాషియర్ లెండి . అంటే ఏమీకాదు . వారం వారం సంత చేయడం , కిరాణా సామానులు అవీ తేవడం అన్నీ నేనే చేసేవాడిని . అప్పుడు మిగిలిన చిల్లర నా దగ్గరే ఉండేది . ఎక్కువ ఊహించుకోకండి . అర్దరూపాయో అరవై పైసలో అలాగన్నమాట . ఇందులో మళ్ళీ ఒక స్పెషల్ ఆఫర్ ఉండేది . అప్పుడు నేను ఎనిమిదో తరగతి , పెద్ద తమ్ముడ