పోస్ట్‌లు

2017లోని పోస్ట్‌లను చూపుతోంది

పరస్పర సహకారం

                                                                               మొన్న ఇస్రో వారు సార్క్ దేశాల ప్రయోజనార్ధం ఉపగ్రహాన్ని ప్రయోగించినపుడు యావత్తు ప్రపంచం మన దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.  పొరుగుదేశాలకు ఉచితంగా మన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందించడంలో మన ఉదారతను ఉచితరీతిని అందరూ కొనియాడారు . ప్రధాన మంత్రి పదవిలోకి  రాగానే పొరుగుదేశం బాగుంటే మనము బాగుంటాం అంటూ ఈ  ప్రాజెక్టును మొదలు పెట్టించిన నరేంద్రమోడీకి   అభినందనలు వెల్లువెత్తాయి.  ఇరుగు చల్లన... పొరుగు చల్లన  అనే  నానుడి ని తలకెక్కించుకొని పొరుగుకే అగ్ర తాంబూలం అంటూ ఈ ప్రాజెక్ట్ ను తలపెట్టిన భారతీయతకు నిజమైన నివాళులు అర్పించాలి అందరూ. అసలు ఈ  'ఇజం ' మన భారతీయుల నైజం .                     నన్ను  అడిగితే ఇది మన తర తరాలలో రక్తంలో ఇంకిపోయినదని అనుకొంటాను . ఇప్పుడంటే నేను, నా  భార్య , నా పిల్లాడు , నా పిల్ల అనే కేవలం తన కుటుంబ కేంద్ర స్వార్ధపూరిత మనస్తత్వాలు పెరిగిపోయాయి కానీ అనాది నుంచి మనది వసుధైక కుటుంబం అనే భావన కాదా .                   పిండి వంటలు వండినా , ఊరగాయలు పెట్టినా ఒకరికి ఒకరు రుచులు చూడటం కోసం ఇచ్చిపు