పీచు మిఠాయి....


మీరు ఎప్పుడైనా పీచు మిఠాయి తిన్నారాఅదేదో పెద్దగా ఉంటుంది కాని పట్టుకుంటే దూది లా ఉండి ఇట్టే కరిగిపోతుంది

మా చిన్నప్పుడు దాన్ని తయారుచేసేవాడు వస్తే వాడి చుట్టూ మూగేవాళ్ళం తినడం కంటే ఎక్కువ తయారుచేయడం చూడాలని సరదాగా ఉండేది. గుండ్రటి వెడల్పు ఇత్తడి పాత్ర కింద స్టౌ వుండేది వేడి చేస్తూ పంచదార, మిఠాయి రంగు వేసి కలుపుతూ వుంటే అది గుండ్రంగా తిరుగుతూ వుండేది. బూజు బూజులా చుట్టూ తయారవుతుంటే వేడి మీద పుల్లతో దాన్ని చుట్టి ఇచ్చేవాడు. దాన్ని అపురూపంగా తీసుకొని చూసుకొంటూ తినేవాళ్ళం.

       చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేవాటిలో బొంబాయి మిఠాయి ఒకటి ఇది మరో రకంగా నచ్చేది. పెద్దకర్ర బుజాన వేసుకొని వచ్చేవాడు . దానికి చివర ముద్దలా పంచదార పాకం చుట్టపెట్టి వుండేది గులాబి రంగులో వుండి పైన ఒక ప్లాస్టిక్ కవర్ కప్పి వూరిస్తూ వుండేది. పిల్లలంతా అతని చుట్టూ చేరేవాళ్ళం ఇది కూడా తినడానికి కంటే చూడటానికే ఎక్కువ ఇంట్రస్ట్ వుండేది. ఎందుకంటే దాన్ని రకరకాల బొమ్మలుగా చేసేవాడు. ఎక్కువగా చేతికి వాచీలుగా చేసి ఇచ్చేవాడు. తేలుబొమ్మ, ఇంకా రకాలు చేయడం చూడటానికి చాలా బాగుండేది.




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం