మౌనమె నీ భాష ఓ మూగ మనసా ...

  


       కృషితో నాస్తి దుర్భిక్షం
       జపతో నాస్తి పాతకం
       మౌనేన కలహం నాస్తి
       నాస్తి జాగరతో భయం
       కష్టపడి పనిచేసేవారికి కరువు రాదు. నిత్యం దేముణ్ణి తలచేవాడికి పాపం రాదు. మౌనంగా ఉండే       వారికి గొడవలు రావు అని అర్ధం.
మౌనంగా ఉండటం అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండమని కాదు. అనవసరంగా మాట్లాడవద్దని.
మౌనమ్ అంటే మన ఎదురుగా ఏమి జరుగుతున్నా పట్టించుకోవద్దు అని కాదు. మళ్ళీ అది నిర్లిప్తత.
మనం కోపం లేదా ఆవేశంగా ఉన్నపుడు వివేకాన్ని కోల్పోతాము. అపుడు మౌనాన్ని ఆశ్రయించడం మేలు.
ఆవేశంలో అవతలి వారు ఒకటంటే మనం మరొకటి అంటాం. అదే కూడదన్నమాట. అందుకే మానసికవేత్తలు కోపం వచ్చినపుడు ఒకటి, రెండు, మూడు అంటూ అంకెలు లెక్కించమంటారు.
మౌనం వలన మానవ సంబంధాలు మెరుగుపడతాయి. మనసులు ముడిపడతాయి.
       ఉపవాసం చేసినపుడే మనకు ఆకలి విలువ తెలుస్తుంది.
       మౌనాన్ని పాటించినపుడే మాటల విలువా తెలుస్తుంది.
       మౌనం అంటే మాటలుండవు. ఆలోచనలూ ఉండవు. మనతో మనం మాట్లాడుకోవటమే మౌనం. అదో విధమైన తపస్సు. అదో రకమైన ధ్యానం. ధ్యానం మనసుకు వ్యాయామం వంటిది. దాని వలన అనవసర ఆలోచనలు దరికి రావు.

మౌనం వలన మన మనసు విశాలమౌతుంది. మన అంతః ప్రపంచం పెరుగుతుంది. మన నిర్ణయాలు ఖచ్చితత్వాన్ని పొందుతాయి. పొరపాటుకు తావుండదు.
మౌనం వలన అద్భుత భావవ్యక్తీకరణ సాధ్యమవుతుంది. వృధా ఆలోచనలు రావు. ప్రతి నిర్ణయమూ     క్రియాశీలమే . ప్రతి అడుగూ మన లక్ష్యం వైపే.
       అందుకే గాంధీజీ ప్రతి సోమవారం మౌనవ్రతాన్ని పాటించేవారు
       మెహర్ బాబా అంటారు " గొంతు మౌనంగా ఉన్నపుడు మనసు మాట్లాడుతుంది. మనసు మౌనంగా ఉన్నపుడు
హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌన ముద్రలో ఉన్నపుడు అంతరాత్మ అనుభూతిస్తుంది."
ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు రవిశంకర్ అంటారు. " వేయి మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క మాటలో     చెప్పవచ్చునువేయి చూపులతో చెప్పలేని భావాన్ని ఒక్క మౌనంతో చెప్పవచ్చును. "
రమణమహర్షి మాటల్లో " మౌనం అంటే పదాల ప్రతిబందకాలు లేని నిశ్శబ్ద సంభాషణమే " .


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం