అధికస్య అధికం ఫలం


చాలా మంది ఎక్కువ చేస్తే ఎక్కువ ఫలం వస్తుంది అనుకొంటారో ఏమో తెలియదు. నేను రోజూ మార్నింగ్ వాక్ కి వెళుతూ చూస్తాను. తెల్లవారకుండానే చేతిలో ప్లాస్టిక్ కవర్, చిన్న కర్ర పట్టుకుని బయలుదేరతారు. ఎవరెవరి ఇంట్లో గోడలమీద నుంచి మందార, గన్నేరు, ఇంకా రకరకాల పూలమొక్కలు ఉంటాయో చూసుకొంటూ. ఎవరినీ అడగరు వాళ్ళకు కావలసినవి కోసేసుకోడమే. పోనీ పూజకి ఒకటో, రెండో పరవాలేదు. చెట్టుకున్నవన్నీ అందినమటుకు కోసేయటమే. దేముడికి ఎన్ని పూలు పెట్టామన్నది కాదు. ఎంత భక్తితో పూజ చేసాము అన్నది ముఖ్యం. కాని వాళ్ళకి ఎన్ని ఎక్కువ పూలతో చేస్తే అంత ఎక్కువ పుణ్యం అనుకొంటారేమో మరి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం