పేరులో ’నేమ్’ంది. ?



       చాలా ఊర్ల పేర్ల వెనుక ఒక కారణం కాని కధ కాని ఉంటుంది. మన ఇంటి పేర్ల వెనుక కూడా అలాగే ఉంటుంది. కొన్ని ఊర్ల పేర్లను చూద్దాం. ముందు మా ఊరు తోనే మొదలు పెడదాం.

       "కాకినాడ" పేరు చూస్తే చాలా సంవత్సరాల ముందు అసలు కాకినాడ ఊరు కంటే "కోరింగ" పెద్ద ఊరు . కోరింగ ఒక ఓడరేవు కూడా. ఇక్కడ నుంచి మంచి వర్తకం జరిగేది. మొదట్లో ఊరి పేరు " కాకినందివాడ" దీన్ని చూసి "కో కెనడా" ఆంగ్లంలో co canada  అనేవారు , దానినే "కోకనాడ" అని పిలిచేవారు. అది క్రమంగా "కాకినాడ" అయిందట.

       "రాజమండ్రి" పేరుని పరిశీలిస్తే అసలు పేరు " రాజమహేంద్రవరం" దీనిని రాజరాజ నరేంద్రుడు పరిపాలించేవారు. అది క్రమంగా "రాజమహేంద్రి" అయి ఆంగ్లంలో "రాజమండ్రి" అయింది.

       "సఖినేటిపల్లి" పేరును పరిశీలిస్తే రాముడు, సీత, లక్ష్మణుడు వనవాసం చేస్తూ ఇక్కడ రాత్రి కావడంతో నేటి బస ఇక్కడే అన్న ఉద్దేశ్యంతో సీతతో సఖి, నేటి పల్లి ఇదే అనటంతో అది " సఖి నేటి పల్లి " అయింది.

       శ్యామలాదేవి అనే రాణి కోటను నిర్మించుకొని పరిపాలించిన ప్రాంతం "శ్యామల కోట" అయి అది క్రమంగా "సామర్లకోటఅయింది.


       దశరధుడు, కైకతో కలిసి రధంపై వెళుతుండగా రధచక్రానికి ఉన్న సీల ఊడిపోయిందట. కైక తన వేలు ను సీలగా ఉంచి ప్రమాదం తప్పించిందట. అందుకే ఊరిని "కైక వేలు" అని  పిలిచే వారుట అదే తరువాత "కైకవోలు" అయిందని ఒక కధనం


              అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన పురూహుతికా దేవి కొలువైన ఊరు , పీఠం వున్న పురం కాబట్టి పీఠికా పురం అయి క్రమేపీ పిఠాపురం అయింది

       కౌజుపిట్టలు ఎక్కువగా ఉండే ఊరు కౌజుఊరు క్రమేపీ కౌజులూరు అయి కాజులూరు అయిందట.
ఇలా చూస్తే చాలా ఊర్లకు వెనుక కధలు ఉంటాయి. మరికొన్ని కధలు తరువాత పోస్ట్ లో చూద్దాం.




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం