కార్తీక మాసం అనగానే గుర్తుకు వచ్చేది సోమవారం ఉపవాసం ఉండడం , కార్తీక పురాణం చదవడం , శివాలయానికి వెళ్ళడం . మా చిన్నతనంలో నేను మూడు , నాలుగు తరగతులు చదివే రోజుల్లో కాకినాడ , రామారావు పేటలో ఉండే వాళ్ల్లం . నేను , మా తమ్ముడు రామారావు పేట స్కూల్ లో చదివేవాళ్ళం . దానినే ఇసక తిప్ప స్కూల్ అనేవారు . అక్కడ స్కూలు , ఈశ్వర పుస్తక భాండాగారం మాత్రమె ఉండేవి . మిగిలిన కాళీ అంతా ఇసకపర్ర . అందుకే ఆ పేరు వచ్చింది . కార్తిక మాసం వస్తే ప్రతి రోజు కార్తీక పురాణం చదివే వాళ్ళం . అందులో పోటీ కొద్దీ ఒకేరోజు రెండు, మూడు రోజులవి కూడా చదివేసి నేను ఇన్నో రోజంటే , నేను ఇన్నో రోజని అనుకునేవాళ్ళం . సోమవారం తప్పనిసరిగా ఉదయం నుంచి ఉపవాసం ఉండే వాళ్ళం . కేవలం ఉదయం పాలు తాగి స్కూల్ కి వెళ్లి వచ్చి ,మద్యాహ్నం మళ్లీ పాలు తాగి సాయంత్రం వరకు ఉండే వాళ్ళం . మధ్యలో ఏమి తినకూడదని అంటే అలాగే చేసేవాళ్ళం . సాయంత్రం వచ్చి స్నానం చేసి శివాలయానికి వెళ్ళే వాళ్ళం . వస్తూ ఎప్పుడు చీకటి పడుతుందా , నక్షత్రాలు కనపడతాయా అని ఎదురు చూసే వాళ్ళం . ఆకలికో మరి ఎందుకో ఎటు చూసినా చుక్కలు కనపడేవి . అమ్మ చూసి నక్షత్ర దర్శనం చేసుకొని అప్పుడు అన్నం పె...