పోస్ట్‌లు

జులై, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

ఇండోర్ ప్లాంట్స్ ఉపయోగాలెన్నో

చిత్రం
ప్రకృతి ప్రసాదించిన పచ్చదనం మానవ చర్యల వల్ల తరిగిపోతోంది . ఫలితంగా వాతావరణం కలుషితమైపోతోంది . దీంతో మనుషులు అనేక రకాల అనారోగ్యాలకు లోనవుతున్నారు . నాలుగు గదుల మధ్య ఆఫీసుల్లో ఎక్కువ సమయం గడిపేవారు కాలుష్యాల వల్ల త్వరగా అ లసిపోతారు . మనస్సు , శరీరం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని పనులు సజావుగా    చేసుకునేందుకు అవకాశం కలుగుతుంది . ఆఫీసులో మనస్సుకు ఆహ్లాదం ఉత్తేజం కలిగించేందుకు పచ్చని మొక్కలు , పుష్పాలు అవి అందించే సువాసనలు ఎంతగానో ప్రయోజనం కలిగిస్తాయి . బయటి వాతావరణం కంటే ఆఫీసుల్లో సరైన గాలి , వెలుతురు రాకపోవడం వల్ల కాలుష్యం 5 రెట్లు పెరుగుతుందని న్యూయార్క్ ‌ కు చెందిన ఇంటిగ్రేటివ్ ‌ మెడిసిన్ ‌ ఫిజిషియన్ ‌ జేమ్స్ ‌ డిల్లార్డ్ ‌. ' ప్లాంట్స్ ‌ వై . యు కెనాట్ ‌ లివ్ ‌ విత్ ‌ దెమ్ ‌ పుస్తకరచయిత బిల్ ‌ ఓల్వ్ ‌ టర్న్ ‌ లు తెలియజేస్తున్నారు . ఐతే ఏ మొక్కలైతే ఎక్కువ ఉపయోగంగా ఉంటాయో వారు వివరించారు . ఏవి ఎంచు కోవాలనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది . గదిలోకి సూర్యకిరణాలు , వెలుతురు ఏ మేరకు వస్తుంది . గది

బంగాళా దుంప -- బహు ప్రీతి

చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా లభించే కూరగాయల్లో బంగాళాదుంప ఒకటి. పొటాటో చిప్స్ , పొటాటో కుర్మా... ఇలా అనేక రకాలైన వెరైటీలను బంగాళాదుంపలతో చేస్తుంటారు.   పుష్కలంగా పిండి పదార్థాలను కలిగి ఉన్న ఈ దుంపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బంగాళాదుంపలో ఉండే బి 6 విటమిన్ శరీరంలోని ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తాయి. ఆలులో ఉన్న పీచు పదార్థం గుండెజబ్బుల నుండి రక్షణనిస్తుంది. భోజనం చేసే ముందు ఒకటి లేదా రెండు చెంచాల ఆలూ రసం తీసుకుంటే రుమాటిజం తగ్గుతుంది. పచ్చి బంగాళాదుంప రసం తీసుకుంటే జీర్ణాశయం , పేగుల ఇబ్బందులు తొలగుతాయి. బంగాళాదుంపలను సన్నగా కోసి ఆ ముక్కలను అలసిన కళ్లపై పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే పచ్చి దుంప రసాన్ని ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా ఉంటుంది. బాలింతలకు బాగా పాలుపడాలంటే బంగాళాదుంపలను ఆహారంలో చోటు కల్పిస్తే సరి. ఇన్ని ఉపయోగాలున్న బంగాళాదుంపలను స్థూలకాయులు మాత్రం తీసుకోకూడదు. షుగర్ వ్యాధితో బాధపడేవారు , కీళ్ల నొప్పులున్నవారికి ఇది మంచిది కాదు. ఆకుపచ్చగా ఉండే బంగాళాదుంపలలో సొలనైన్ అనే పదార్థం టాక్సిన్‌గా పనిచేస్తుంది. కనుక వాటిని తీసుకోకూడదు. సహజంగా చాలామంది బంగాళాదుంపలను మాంసంతో కలిపి వ