పోస్ట్‌లు

మార్చి, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

కూరగాయల ఆకృతులు

చిత్రం
మనం కూర గాయలను కేవలం తినటానికే కాకుండా రకరకాలుగా వాడవచ్చును . మనలో ఆ సృజనాత్మకత ఉండాలే గాని వాటికి ప్రాణం పోయవచ్చును . కూరగాయలతో , పళ్ళతో రూపొందించిన వివిధ ఆకృతులు చూద్దాం రండి . మనం కొన్ని కాయలు పళ్ళు చూసినపుడు ఇవి ఆ ఆకారంలో ఉన్నాయి , ఇవి వీటిలా ఉన్నాయి అనుకొంటాము కదా !  మన ఊహలకు ప్రాణం పోయవచ్చును .

షడ్రుచుల మేళవింపు.

చిత్రం
" ఉగాది " మన తొలి పండుగ . కొత్త ఆశలతో , కొంగ్రొత్త ఊహలతో నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టే రోజు . ఆరు రుచుల మేళవింపుతో మనం ఆస్వాదించే పచ్చడి మనకు జీవితంలో కష్టసుఖాలు , ఆటుపోట్లు అన్నీ ఉంటాయని వాటిని అన్నింటినీ సమంగా స్వీకరించాలని అంతరార్ధం ఇమిడి ఉంది . ఉగాది పచ్చడి లోని తీపి మనకు జీవితంలో మంచి మంచి అనుభవాలను , గుర్తుచేస్తుంది . చేదు వాటితో పాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయని తెలుపుతుంది . పులుపు , వగరు , కారం , ఉప్పు మొదలైన రుచులన్నీ నాలుకకు తగిలీ తగలనట్లు రుచికి వేస్తాం . ఇవన్నీ మన జీవితంలో అలా అలా వచ్చిపోతుంటాయని సూచిస్తాయి . జీవితం అంటేనే వెలుగునీడల సయ్యాట . దేనినైనా మనం సమానంగానే స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి . అందరికీ " జయ " నామ సంవత్సరానికి స్వాగతం , సుస్వాగతం . నూతన సంవత్సర శుభాకాంక్షలు . 

తస్మాత్ జాగ్రత్త.

చిత్రం
చూసారు కదా ! మనకు చేతిలో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని   అవసరం లేని వాళ్ళు కూడా వాడితే ఏం జరుగుతుందో . డ్రైవింగ్ కాని ఓటు కి కాని ఇలా అన్నింటికీ వయసు నిబంధన పెట్టడం అనేది ఆ వయసుకు కొంత మానసిక పరిణితి వస్తుందని . రోడ్డు పైన పదేళ్ళు కూడా లేని వాళ్ళు బండి నడుపుతున్నారు అన్నా , ఇలా ఫేసుబుక్ , నెట్ వంటివి వాడుతున్నారు అన్నా వాళ్ళది కాదు తప్పు . తలితండ్రులదే . మా వాడు పెద్ద బండి నడిపేస్తాడు తెలుసా ? అంటూ గొప్పలు చెప్పుకోవచ్చు అనుకొంటారు . ఏదో ఒక ప్రమాదం జరిగేవరకూ సరదాగానే ఉంటుంది . అప్పుడు మాత్రం గొల్లు మంటారు . అదేవిధంగా ఈ నెట్ వాడకం కూడా పదో తరగతి చదివే వాడికి ఫేస్ బుక్ అవసరమా . తలితండ్రుల నియంత్రణ లేకపోవడం ఇటువంటి అనర్ధాలకు కారణం .   

మానవ నైజం

       ఒకసారి నేను , నా భార్య మెయిన్ రోడ్ కి షాపింగ్ కి వెళ్ళాం . ఒక షాప్ ముందు బండి ఆపాను . ఏదో కొనడానికి 500 నోట్ ఇచ్చాను . నువ్వు వెళ్ళి కొనుక్కుని వచ్చెయ్ అని . సరే అని షాప్ లోకి వెళ్ళింది . కావలసినవి లేవని వచ్చేసింది . ఇంతలో ఒక ముష్టివాడు రూపాయి ఇవ్వండమ్మా ? అని అడుగుతుంటే మేము ఏమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాము . మరో షాప్ దగ్గర ఆగి వెళ్ళి కొనుక్కో అన్నాను . వెళుతూ డబ్బులు అంది . ఇందాకా ఇచ్చాను కదా అన్నాను . మీకు ఇచ్చేసాను కదా అంది . ఇవ్వలేదు , అక్కడ గాని పడేసావేమో   వాడు తీసేసుకొనే ఉంటాడు అనుకొంటూ    మళ్ళీ వెనక్కి వెళ్ళాము . ఆ ముష్టివాడు అక్కడే ఉన్నాడు . బండి ఆపిన చోట బాగా వెతికాము . దొరకలేదు . ఇంతలో అతను దగ్గరకు వచ్చి ఇందాకా కింద పడేసుకున్నారు బాబూ అంటూ నోట్ అందించాడు . వెంటనే సిగ్గుపడ్డాము . అతనిని తక్కువగా అంచనా వేసినందుకు . మాట్లాడకుండా ఒక 50 నోట్ అందించాము అతనేమీ అడక్కుండానే . అదేనేమో మానవ నైజం .

కుశలమా?.... నీవు కుశలమేనా?

వార్ధక్యం వెంట వ్యాధులు రావటం సహజం . చిన్న , చిన్న అనారోగ్యానికీ , అసౌకర్యానికీ చింతించాల్సిన అవసరం లేదు . శరీర ఎపుడూ కుశలంగా ఉండాలని కోరుకోకూడదు . కబీర్ అందుకే ఇలా అన్నాడు . " కుసల , కుసల సబ్ పూచలే , కుసల కిసీ కా హోయ్ జరా ము ఈ నా భయ్ ము అ , కుసల కా హే కో హోయ్ ! "        ప్రపంచంలో అందరూ కుశలమా ? క్షేమమా ? బాగున్నావా ? కులాసాయేనా ? అని అడుగుతూ ఉంటారు . నిజానికి కుశలం ఎక్కడుంది ? ఎవరికుంది ? ముసలితనమూ పోలేదు . మృత్యు భయమూ పోలేదు . అవి ఎలాగూ వస్తాయి . ఇక కుశలమెక్కడిది ? అని ప్రశ్నించాడు . 

ఒత్తిడిని ఓడించండి ఇలా ........

మన నేటి యాంత్రిక జీవనంలో ఒత్తిడి ఒక భాగం అయిపోయింది . కొన్ని జాగ్రత్తలు తీసుకోడం  ద్వారా ఒత్తిడిని జయించవచ్చును. అవేంటో చూద్దాం. 1. మనం తినే ఆహారంలో క్యారెట్, కిరా , చిలకడ దుంపలు ఎక్కువగా ఉండాలి. 2. అయోడిన్ , మెగ్నీషియం , అధికంగా ఉండే పదార్ధాలను తీసుకోవాలి. 3. చేపలలోను , చీజ్ కేక్ వంటి వాటిలో అయోడిన్  స్థాయిలు పెంచే లక్షణం ఉంది. అవి ఎక్కువగా తినాలి. 4. బీన్స్, వేరుశనగ , పాలకూర, వంటి వాటిలో  మెగ్నీషియం  ఎక్కువగా లభిస్తుంది. 5. మన ఆహారంలో తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం కూడా ఒత్తిడిని జయించడానికి దోహద పడుతుంది . 6. అదేవిధంగా సెలీనియం , డి విటమిన్ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వాళ్ళ కూడా ఒత్తిడిని దూరం చెయ్యవచ్చును.  

కిడ్నాప్.....

వెంగళప్పకి ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించెయాలని కోరిక కలిగింది. సినిమాలు చూసిన అనుభవంతో కిడ్నాప్ చేయాలనుకొన్నాడు. పార్క్ కి వెళ్ళాడు. ఒక కుర్రాడిని సెలెక్ట్ చేసుకొన్నాడు. వాడిని పట్టుకొని " నాకు పాతిక లక్షలు ఇవ్వకపోతే మీ అబ్బాయిని వదలను " అని ఉత్తరం వ్రాసి వాడి జేబులో పెట్టి ఇంటికి పంపించాడు . వెంటనే మర్నాడు ఆ కుర్రాడు సూట్ కేస్ తో డబ్బులు పట్టుకుని వచ్చాడు . జేబులో ఒక ఉత్తరం ఉంది. అందులో ఇలా ఉంది. " నువ్వు అడిగిన డబ్బు పంపుతున్నాను. మా అబ్బాయిని వదిలేయి . ఇట్లు పెద్ద వెంగళప్ప ." . 

పేరులో ’నేమ్’ంది. ?

చిత్రం
       చాలా ఊర్ల పేర్ల వెనుక ఒక కారణం కాని కధ కాని ఉంటుంది . మన ఇంటి పేర్ల వెనుక కూడా అలాగే ఉంటుంది . కొన్ని ఊర్ల పేర్లను చూద్దాం . ముందు మా ఊరు తోనే మొదలు పెడదాం .        " కాకినాడ " పేరు చూస్తే చాలా సంవత్సరాల ముందు అసలు కాకినాడ ఊరు కంటే " కోరింగ " పెద్ద ఊరు ట . కోరింగ ఒక ఓడరేవు కూడా . ఇక్కడ నుంచి మంచి వర్తకం జరిగేది . మొదట్లో ఈ ఊరి పేరు " కాకినందివాడ " దీన్ని చూసి " కో కెనడా " ఆంగ్లంలో co canada   అనేవారు , దానినే " కోకనాడ " అని పిలిచేవారు . అది క్రమంగా " కాకినాడ " అయిందట .        " రాజమండ్రి " పేరుని పరిశీలిస్తే అసలు పేరు " రాజమహేంద్రవరం " దీనిని రాజరాజ నరేంద్రుడు పరిపాలించేవారు . అది క్రమంగా " రాజమహేంద్రి " అయి ఆంగ్లంలో " రాజమండ్రి " అయింది .        " సఖినేటిపల్లి " పేరును పరిశీలిస్తే రాముడు , సీత , లక్ష్మణుడు వనవాసం చేస్తూ ఇక్కడ రాత్రి కావడంతో నేటి బస ఇక్కడే అన్న ఉద్దేశ్యం