మానవ నైజం


       ఒకసారి నేను , నా భార్య మెయిన్ రోడ్ కి షాపింగ్ కి వెళ్ళాం. ఒక షాప్ ముందు బండి ఆపాను. ఏదో కొనడానికి 500 నోట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళి కొనుక్కుని వచ్చెయ్ అని. సరే అని షాప్ లోకి వెళ్ళింది. కావలసినవి లేవని వచ్చేసింది. ఇంతలో ఒక ముష్టివాడు రూపాయి ఇవ్వండమ్మా? అని అడుగుతుంటే మేము ఏమీ ఇవ్వకుండానే వెళ్ళిపోయాము. మరో షాప్ దగ్గర ఆగి వెళ్ళి కొనుక్కో అన్నాను. వెళుతూ డబ్బులు అంది. ఇందాకా ఇచ్చాను కదా అన్నాను. మీకు ఇచ్చేసాను కదా అంది. ఇవ్వలేదు , అక్కడ గాని పడేసావేమో  వాడు తీసేసుకొనే ఉంటాడు అనుకొంటూ   మళ్ళీ వెనక్కి వెళ్ళాము. ముష్టివాడు అక్కడే ఉన్నాడు. బండి ఆపిన చోట బాగా వెతికాము. దొరకలేదు. ఇంతలో అతను దగ్గరకు వచ్చి ఇందాకా కింద పడేసుకున్నారు బాబూ అంటూ నోట్ అందించాడు. వెంటనే సిగ్గుపడ్డాము. అతనిని తక్కువగా అంచనా వేసినందుకు. మాట్లాడకుండా ఒక 50 నోట్ అందించాము అతనేమీ అడక్కుండానే . అదేనేమో మానవ నైజం.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం