నెల బాలుడు.


నా "కాకినాడ కాజా " బ్లాగ్ వీక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను బ్లాగు ను జనవరి ఒకటవ తేదీన ప్రారంభించినప్పటికీ రోజు నుండే సరిగా వ్రాయడం ప్రారంభించాను. కాబట్టి నెల రోజులు పూర్తి చేసుకోవడం జరిగిందని భావిస్తున్నాను. ఎన్నో చదివి, చూసి, నేను కూడా రాయాలని బలంగా అనిపించి మొదలు పెట్టాను. కాని ఇంతకు ముందు బ్లాగ్ అనుభవం కాని, రాయడం కాని అలవాటు లేదు. నేనింకా ఓనమాలు నేర్చే స్థితి లోనే ఉన్నాను. నా అనుభవలేమి వలన తోచినదేదో రాసేస్తున్నాను. అయినప్పటికీ ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు.

       మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. ఎందరో మనుషులను చూస్తుంటాం. అవి చూసి ఎన్నో ఆలోచనలు, మరెన్నో భావాలు కలుగుతుంటాయి. నా మది సొద నంతా పది మందితో పంచుకోవాలని అనుకొని బ్లాగ్ మొదలుపెట్టాను. పుస్తకాలు చదివే అలవాటు చాలామందిలో తగ్గిపోయింది. అయినాప్పటికీ ఇంకా కొందరు నెట్ లో చదివే అలవాటు చేసుకొన్నారు. కాబట్టి కొంతమందినైనా విధంగా చేరాలనే నా కోరిక విధంగా తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. నేనింకా నేర్చుకొనే దశలోనే ఉన్నాను. నాకు తెలిసిన విషయాలు ( నాకు మాత్రమే తెలుసు అనుకోవటం లేదు ) పది మందితో పంచుకొందామనే ఆశతో .... మీ "కాకినాడ కాజా" . 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం