తెలుగు భాషా చరిత్ర రెండవ భాగం



మను స్మృతి ప్రకారం ఆంధ్రులు కారావార స్త్రీకి, వైదేహునికి    జన్మించారని అంటారు.
       "కారావారో నిషాదాత్తు చర్మకారః ప్రసూయతే
       వైదేహి కా దంధ్ర మే దౌ బహిర్గ్రామా ప్రతిశ్రయౌ " అనే శ్లోకం లో      ఆంధ్రుల గురించి ఉంది.
       కువలమాల అనే గ్రంధంలో ఆంధ్రుల గురించి ఇలా ఉంది.
       "ప్రియ మహిళా సంగామే సుందర గత్తేయ ఖోయణో రోద్దే అటు వుటురటుం భణంతే ఆంధ్రౌ కుమారో సలోయేతి"
       అంటే ఆంధ్రులు ఆహార విహార ప్రియులని, అందమైన వారని తెలిసింది.
       మహాభారతంలొ కూడా ఆంధ్రరాజుల ప్రస్తావన ఉంది. మయసభలో అంగ, వంగ , పుండ్రక, పాండ్య ,ఓఢ్ర రాజులతో పాటు ఆంధ్ర రాజులు కూడ ధర్మరాజును కొలిచారని తెలుస్తోంది.
       వాయుపురాణంలో ఆంధ్రభృత్యుల పేర్లు తెలుపబడ్డాయి. వారే శాతవాహన రాజులు క్రీ. పూ 220 లో    ఆంధ్రదేశాన్ని పాలించారు.
       " ఆంధ్రక" శబ్దం నుంచి కూడా ఆంధ్ర అనే పదం వచ్చిందని అంటారు. మహాభారతంలో భీష్ముడు శాంతి పర్వంలోదక్షిణ పధ జన్మానః సర్వే నవతాంధ్రకాః గుహాః పుళిందాః        శబరాశ్చుచుకామద్రకై స్సహ " అన్నాడు. అంటే ఆంధ్రకులు, శుహులు, పుళిందులు, శబరులు, చుచుకులు, మద్రకులు దక్షిణాపధంలో పుట్టారని తెలుస్తోంది.
       భాగవతంలో అంధకులు యాదవ జాతికి చెందిన ఒకతెగ వారని, ద్వారకానగర సంరక్షులని      చెప్పబడింది. అంధ శబ్దం నుంచి ఆంధ్ర శబ్ధం వచ్చిందని అనుకోవచ్చును.

ఇంత చరిత్ర ఉన్న మన ఆంధ్ర భాష నేడు నిర్లక్ష్యం చేయబడుతోంది.




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం