వేదాలలో గణిత ప్రాముఖ్యం
వేదాలలో గణితశాస్త్రానికి ప్రముఖ స్థానం ఇచ్చారు. ఈ శ్లోకం చూడండి.
" యధా శిఖా మయూరాణాం
నాగానాం మణయో యధా
తద్వద్వేదాంగ శాస్త్రాణం
గణితం మూర్ధని స్థితమ్ " .
" నెమళ్ళకు శిఖల వలె, పాములకు మణులవలె , వేదాంగ శాస్త్రాలన్నింటికీ శిరస్సున గణితం ఉంది. " అని అర్ధాన్నిచ్చే ఈ శ్లోకం వలన గణితానికి వేదకాలంలో ఉన్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చును.
ఆనాడు కాలం, ముహుర్తం, వంటి కాలప్రమాణాలు, గ్రహగతులు వాటి ప్రభావం, సూర్య చంద్రులు, నక్షత్రముల స్థితిగతుల గురించి వారికి గల గణిత పరిజ్ఞానం ఎంతో అపారం. ఎప్పుడో రాబోయే సూర్య, చంద్ర గ్రహణాలు, కురవబోయే వర్షాలు, కాయబోయే ఎండలు, అన్నింటినీ ముందే లెక్కించే వారు.
వేదకాలంలో యజ్ఞ వాటికల నిర్మాణం, అగ్నిహోత్ర హోమకుండాలు మొదలైన వాటి గురించి వారికి గల రేఖాగణిత జ్ఞానం ఉపయోగ పడేది.