ఫైథాగరస్ సిద్ధాంతం భారతీయులదా?

ఫైథాగరస్ సిద్ధాంతం భారతీయులదా?

అని అడిగితే అవుననే చెప్పాలి. క్రీ. పూ ఎనిమిదవ శతాబ్దానికి చెందిన బౌద్ధాయనుడు, ఆపస్తంబుడు, కాత్యాయనుడు మొదలైన వారు రేఖాగణితంలో విశేషప్రతిభ కనపరిచారు. ఆనాడు యజ్ఞవాటికల నిర్మాణంలో వివిధ రేఖాచిత్రపరిజ్ఞానం అవసరమయేది. దానికోసం వీరు " త్రాడు" నుపయోగించేవారు. దీనినే "శుల్బం" అంటారు. త్రాడునుపయోగించి వేసిన సూత్రాలను "శుల్బసూత్రాలు" అంటారు. వీరికి చతురస్రం, దీర్ఘ చతురస్రం, రాంబస్, వృత్తం మొదలైన వివిధ రకాల రేఖాచిత్రాలపరిజ్ఞానం ఉన్నది. వాటి వైశాల్యాలు కొలిచే నైపుణ్యం కూడా వారికి కలదు.

నేడు "ఫైధాగరస్ సిద్ధాంతం " గా పిలవబడుతున్న సూత్రం బౌద్ధాయనుడు అంతకు ముందు ఎప్పుడో సూత్రీకరించారు. " దీర్ఘచతురస్రం యొక్క రెండు భుజాలచే ఏర్పడే చతురస్రం యొక్క వైశాల్యాల మొత్తం , దాని కర్ణం ఏర్పరచు చతురస్రం యొక్క వైశాల్యానికి సమానం" అని చెప్పారు.
అది ఈ క్రింది శ్లోక రూపంలో ఉంది,
" ధీర్ఘచతురస్ర స్యాక్ష్యయా రజ్జుః పార్శమానీ తిర్యగ్జ్ఞ్  మానీచ
 యాత్పృధగ్భూతే కురుతస్త్దుభయం కరోతి !

దీనినే తరువాత పాశ్చాత్యులు "ఫైధాగరస్ సిద్ధాంతం" గా ప్రచారం చేసారు. అది " లంబకోణ త్రిభుజం లోని కర్ణం మీది వర్గం, మిగిలిన రెండు భుజాలమీది వర్గాల మొత్తానికి సమానం " ఇది మన బౌద్ధాయనుడు చెప్పినదే.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం