పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదా ? రెండవ భాగం...
భరద్వాజ మహర్షి వైమానిక శాస్త్రం గురించి చాలా విపులంగా రాసాడు. పాదరసాన్ని ఉపయోగించి విమానాన్ని తయారుచేసే విధానం నేటి రాకెట్స్ లో ఉపయోగించే ద్రవరూప ఇంధన విధానానికి ఆధారం. అమెరికా వారి నాసా నుండి ప్రయోగింపబడే రాకెట్స్ లో దీనినే వాడతారు. సౌరశక్తిని ఉపయోగించి పాదరసాన్ని వాయురూపంలోకి మార్చి, అధిక ఒత్తిడి కలిగించి, దానిని చాలక శక్తిగా మార్చి విమానాన్ని నడపవచ్చును. అంతే కాదు సౌరశక్తిని నిల్వ చేయవచ్చని కూడా వారు వివరించారు. నేటి జెట్ ఇంజన్లలో వాడే సూత్రం అదే. వేదాలలో చెప్పబడిన విమానం నమూనా చూడండి. అంతే కాదు. రామాయణ, మహా భారత గ్రంధాలలో విమానాల ప్రస్తావన ఉంది.
ఇంతకీ విమానాన్ని మొదటి సారి తయారుచేసి ఎగరవేసింది
" శివ్ కర్ బాపూజీ తాల్పడే ". ఈయన 1864 లో జన్మించారు. ఈయన సంస్కృతం నేర్చుకొని వేదాలను అధ్యయనం చేసారు.
ఈయన పండిత సుబ్బరాయశాస్త్రి గారి వద్ద వైమానిక శాస్త్ర రహస్యాలను నేర్చుకొన్నారు. ఆయన ఆధ్వర్యంలో విమానాన్ని తయారు చేసారు. దానికి " మారుత్ సఖ" అని పేరు పెట్టారు. ’మారుత్’ అంటే గాలి, పవనం అని, ’సఖ’ అంటే మిత్రుడు అని అర్ధం. గాలిలో ఎగిరేది కావున ఆ పేరు పెట్టారు. ఈ విమానాన్ని 1895 లో బొంబాయి, చౌపాటి బీచ్ లో శివాజీ రావ్ గైక్వాడ్
, మహదేవ్ గోవింద రానడే ల సమక్షంలో ఎగరేసి ప్రదర్శించారు. ఈ
మానవ రహిత విమానం సుమారు 1500 అడుగుల ఎత్తుకు ఎగిరింది. నాటి ప్రముఖ మరాఠీ పత్రిక " కేసరి" నందు ఈ విషయం ప్రచురించబడింది. కాని దురదృష్టవశాత్తు తల్పడే ఆయన భార్య మరణించడంతో పరిశోధన కొనసాగించలేదు. 1917 లో ఆయన మరణానంతరం ఆ నమూనాను ఆయన బంధువులు రాలీ సోదరులకు అమ్మివేసారు.