సృష్టి కాల గణన
మన భారతీయులకు ఉన్న అపార సంపద వేదాలు. వేదాలు నాలుగు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం . వీటిలో అతి ప్రాచీనమైనది ఋగ్వేదం. వేదకాలాన్ని లెక్కించడానికి వేదాలలో వర్ణించబడిన వివిధ సంఘటనలు, ఆనాటి జీవన పరిస్థితులను ఆధారం చేసుకొని చరిత్రకారులు క్రీ. పూ 6000 నుండి క్రీ. పూ 3000 వరకు వేదకాలంగా నిర్ణయించారు. ఆనాటి ఋగ్వేదం లోనే గణితపరమైన , ఖగోళ పరమైన ప్రస్తావనలున్నాయి.
"శీక్ష విభిందో అష్టై చత్వార్యయుతా, దదత్ అష్టాపరః సహస్ర " అంటే ఒక కల్పము నందు 4320000000 సంవత్సరాలుంటాయి. కల్పము ప్రమాణం పదిస్థానాలు గల సంఖ్య అని వేదంలో చెప్పబడింది.
హిందూ గణన ప్రకారం ఒక మహాయుగంలో 4320000 సంవత్సరాలుంటాయి. దీనిలో 4 యుగాలుంటాయి. అవి కృతయుగం , త్రేతాయుగం, ద్వాపరయుగం, కలి యుగం. ఈ యుగాలన్నీ వరసగా 4:3:2:1 లో ఉంటాయి. అంటే
కృతయుగం కాలం = 4/10 x 4320000 = 17,28,000సంవత్సరాలు
త్రేతాయుగం కాలం = 3/10 x 4320000 = 1296000సంవత్సరాలు
ద్వాపర యుగం కాలం = 2/10 x 4320000 = 864000 సంవత్సరాలు
కలియుగం కాలం = 1/10 x 4320000 =432000సంవత్సరాలు
ఒక కల్పంలో 14
మన్వంతరాలుంటాయి
ఒక మన్వంతరంలో 71 మహాయుగాలుంటాయి.
ఇప్పటికి 6 మన్వంతరాలు అయాయి. అంటే 6 మన్వంతరాలు x 71 మహాయుగాలు
x 4320000 =1840320000 సంవత్సరాలు.
7 వ మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచాయి. అంటే 27 x 4320000 = 116640000 సంవత్సరాలు.
7 వ మహాయుగంలో కలి యుగం జరుగుతోంది. సుమారు 4000000 సంవత్సరాలు. కలుపుకోండి. ఈ గణన ప్రకారం చూస్తే సృష్టి ప్రారంభమై సుమారు (1840320000 + 116640000 + 4000000 =
1960960000 సంవత్సరాలు) అయింది.
నేటి ఆధునిక శాస్త్రవేత్తలు, ఆధునిక యంత్రపరికరాల సహాయంతో లెక్కించగా అది 2000000000 సంవత్సరాలుగా తేల్చారు. దీనికి మరి ఏమనగలం .
మరిన్ని విషయాలను తర్వాత పోస్ట్ నందు చర్చిద్దాము.