పోస్ట్‌లు

పరస్పర సహకారం

మొన్న ఇస్రో వారు సార్క్ దేశాల ప్రయోజనార్ధం ఉపగ్రహాన్ని ప్రయోగించినపుడు యావత్తు ప్రపంచం మన దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తింది.  పొరుగుదేశాలకు ఉచితంగా మన అంతరిక్ష పరిజ్ఞానాన్ని అందించడంలో మన ఉదారతను ఉచితరీతిని అందరూ కొనియాడారు . ప్రధాన మంత్రి పదవిలోకి  రాగానే పొరుగుదేశం బాగుంటే మనము బాగుంటాం అంటూ ఈ  ప్రాజెక్టును మొదలు పెట్టించిన నరేంద్రమోడీకి   అభినందనలు వెల్లువెత్తాయి.  ఇరుగు చల్లన... పొరుగు చల్లన  అనే  నానుడి ని తలకెక్కించుకొని పొరుగుకే అగ్ర తాంబూలం అంటూ ఈ ప్రాజెక్ట్ ను తలపెట్టిన భారతీయతకు నిజమైన నివాళులు అర్పించాలి అందరూ. అసలు ఈ  'ఇజం ' మన భారతీయుల నైజం .
                    నన్ను  అడిగితే ఇది మన తర తరాలలో రక్తంలో ఇంకిపోయినదని అనుకొంటాను . ఇప్పుడంటే నేను, నా  భార్య , నా పిల్లాడు , నా పిల్ల అనే కేవలం తన కుటుంబ కేంద్ర స్వార్ధపూరిత మనస్తత్వాలు పెరిగిపోయాయి కానీ అనాది నుంచి మనది వసుధైక కుటుంబం అనే భావన కాదా .
                  పిండి వంటలు వండినా , ఊరగాయలు పెట్టినా ఒకరికి ఒకరు రుచులు చూడటం కోసం ఇచ్చిపుచ్చుకోడాలు ఆనవాయితీ . చివరికి వండిన కూరలు దగ్గరి నుంచి పొరుగు…

వంటింటి చిట్కాలు

1. ఖరీదైన గాజుసామాగ్రి శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుంచి జారి          పగిలిపోకుండా ఉండకుండా వాటిని తుండుగుడ్డలో చుట్టి శుభ్రం చేయాలి.

2.  గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు,
  చిమటలు ఆదరికిరావు.
3. గచ్చు నేల కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే, ఆరిన తరువాత ఈగలు వాలవు.


4. గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి.


5. గులాబీ పువ్వుల రేకులు ఊడి పోకుండా ఉండాలంటే పూలు తేగానే ప్రతీ 
పువ్వు మధ్యన ఒక చుక్క కొబ్బరి నూనె వేయాలి.


6. చింతపండుతో పాటు కొంచెం ఉప్పు కూడా కలిపి రాగి పాత్రలను తోమినట్లైతే తళ తళా మెరుస్తాయి.


7. చేతికి రానంత చిన్నవై పోయిన టాయిలెట్ సోపు ముక్కలు ఎండ బెట్టి తురిమి సర్ఫ్ వంటి పౌడర్‌లలో కలిపి బట్టలు ఉతికితే కమ్మని సువాసనను అందిస్తాయి.

ఇంటింటి చిట్కాలు

చిత్రం
1. అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే, కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి.

2. కోడిగ్రుడ్డు డొల్లను మెత్తగా పొడిచేసి పాదులకు గానీ, మొక్కలకు గాని వేస్తే మంచి ఎరువులా పని చేస్తుంది.

3. కత్తెరలు గానీ, చాకులు గానీ, పదును పెట్టించుకోవాలన్నప్పుడు, ఒక గరుకు(ఉప్పు)కాగితంతో గట్టిగా రుద్దితే పదునెక్కుతుంది. ఇది ఇంట్లో మనమే చేసుకోవచ్చు.
4. కర్పూరం డబ్బాలో వేసి ఎంత మూతపెట్టినా, కొంత కాలానికి కొంతైనా హరిస్తుంది. నాలుగు మిరియపు గింజలు, నాలుగు బియ్యం గింజలు ఆ డబ్బాలో కర్పూరంతో పాటు వేసి ఉంచితే, కర్పూరం అంత తొందరగా హరించుకుపోదు. 5. కర్ర సామానుల మీద, నేలపై మంచు కురిసినట్లు చెమ్మపడుతూ ఉంటుంది. లీటరు నీటిలో చెంచాడు కడిగే సోడా కలిపి కడగండి. తరువాత శుభ్రమైన నీటితో మరోసారి కడిగి ఆ నేలని ఆరబెడితే మంచిది. 6. కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది.
కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా, కాంతిగా వెలుగుతాయి.

పెద్దలకు మాత్రమే

తెల్లవారుఝామునలేచిచడిచప్పుడుకాకుండామంచందిగాను. అందరూమంచినిద్రలోఉన్నారు. నాభార్య, పిల్లలుఅందరూనిద్రావస్థే. నెమ్మదిగాఅడుగులోఅడుగువేస్తూహాల్లోకివచ్చి , సోఫాలోకిచూస్తే   ’తను’  అక్కడేఉంది. నెమ్మదిగాదగ్గరికివెళ్ళాను. పైనున్నవస్త్రాన్నితొలగించితదేకంగాచూస్తూనిలుచున్నా. సోఫాలోకూర్చుని 'తనని’ ఒళ్ళోచేర్చుకొనిచేతులతోమృదువుగారాస్తూఆనందాన్నిఅనుభవించాను. నాలోఎన్నాళ్ళగానో  'తనపై' ఉన్నకోరికఇప్పటికితీరిందనిఆనందించాను. ఎప్పటినుంచోపెంచుకున్నా'తనపై' వ్యామోహాన్ని. అటూ

దానిమ్మ చేసే మేలెంతో

చిత్రం
దానిమ్మ :
దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ, మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి.
యాంటి ఆక్సి డెంట్  గా పిలువబడే .. .. .. విటమిన్‌ ' ఏ' , విటమిన్‌ ' సి " , విటమిన్‌ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్‌ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును.

ఆరోగ్యానికి జామాకు

చిత్రం
రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా... వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా?ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు  రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ, వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.
జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి.

వినాయక చవితి శుభాకాంక్షలు

చిత్రం