పోస్ట్‌లు

ఏప్రిల్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

షాపింగ్ మాల్

చిత్రం
పైకి కిందికి వెళ్ళడానికి ఎస్కలేటర్స్ ఉన్నాయి. వాటిని చూడగానే నాకు మన్మధుడు సినిమాలో పారిస్ వెళ్ళినప్పుడు బ్రహ్మానందం , నాగార్జున సన్నివేశం గుర్తుకు వచ్చింది .     వచ్చిన వారిని అలరిస్తూ.   అక్కడ వాయిద్య బృందం ఇంగ్లిష్ పాటలు పాడుతున్నారు. పిల్లలకోసం రకరకాల ఆటలుకూడా ఉన్నాయి. రిమోట్ సహాయంతో వెనుక నుంచి నడుపుతుంటే పిల్లలు వాళ్ళే నడుపుతున్నట్లు ఫిలయిపోతున్నారు చూడండి . ఇవే కాదు పిల్లలు ఎక్కి తిరగడానికి బాటరీ ఆపరేటెడ్ రైలు బండి కూడా ఉంది. ఇదే కాదు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టపడే బౌలింగ్ కూడా ఉంది చూడండి see next post

ఫీనిక్స్ షాపింగ్ మాల్

చిత్రం
బెంగుళూరు నగరంలో శనివారం, ఆదివారం వచ్చిందంటే నగరవాసులకు ఆట విడుపు అన్నమాట. ఎక్కువ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో వారం అంతా తీవ్రమైన ఒత్తిడితో పనిచేసి వారాంతాలలో కనుక సేదతిరకపోతే మళ్ళి వారం అంతా పనిచేసే శక్తి రాదు అనుకొంటా . అలా సేద తీరడానికి పలు షాపింగ్ మాల్స్ ఉపకరిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు కన్నా కూడా ఇవే ఎక్కువ ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చును. ఎందుకు అంటే  ఇక్కడ దుమ్ము, ధూళి  ఉండదు. చక్కగా చల్లగా ఉంటుంది . అన్ని వయస్సుల వాళ్లకి తగిన విధంగా ఉంటుంది. అన్నిరకాల వస్తువులు, దేశ విదేశ బ్రాండ్స్ కంపెనీలు అన్నీ ఒకచోటే దొరుకుతాయి. వినోదం కోసం రకరకాల ఆటలు, పాటలు ఉంటాయి. కాయగూరల దగ్గర నుంచి ఇంటికి కావలసిన సమస్త వస్తువులు దొరకుతాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులు  కొనుక్కుపోవచ్చు. ఇక్కడే తినేసి వెళ్లి పోవచ్చును .  అలాటి షాపింగ్ మాల్స్ లో ఫీనిక్స్ షాపింగ్ సిటీ ఒకటి.  ఆదివారం సాయంత్రం దానికి వెళ్ళాము.అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ లో వందలాది కార్లు, బైక్ లు పార్క్ చేసి ఉన్నాయి.పార్కింగ్ ప్లేస్ రెండు అంతస్తులలో ఉంది. ఇక్కడ చాలా చోట్ల మూడు, నాలుగు అంతస్తులలో కూడా పార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. కారున

మెంతి కూరతో మంచి ఎంతో

చిత్రం
మెంతులు , మెంతి ఆకు ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావాలు , బిడ్డ నెలలు నిండకుండా పుట్టడం వంటి సమస్యలు రావు . ప్రసవ నొప్పుల తీవ్రత తగ్గుతుంది . బాలింత మెంతి ఎక్కువగా వాడితే పాలు సమృద్ధిగా పడతాయి .   మెంతి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది . రుతుక్రమ సమస్యలు , ఒంటి నుంచి ఆవిరి వచ్చినట్లు ఉండడం వంటి మెనోపాజ్ సమస్యల నుంచి నివారణకు మెంతి బాగా పనిచేస్తుంది . మెంతి ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది . కౌమారదశ నుంచి వార్ధక్యం వరకు మహిళలకు అన్ని వయసుల్లోనూ మెంతులు , మెంతి ఆకు వాడకం మంచి ఫలితాన్నిస్తుంది .   కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది . గుండె సంబంధిత అనారోగ్యాలను దూరం చేస్తుంది . సోడియం పనితీరును అదుపు చేసి రక్తప్రసరణ వేగాన్ని , గుండె వేగాన్ని నియంత్రిస్తుంది .     రక్తంలో చేరే చక్కెర పరిమాణాన్ని , వేగాన్ని తగ్గిస్తుంది . ఇందులోని అమినో యాసిడ్ ‌ లు ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి .     జీర్ణక్రియకు ఉపకరిస్తుంది . వ్యర్థాలను తొలగిస్తుంది

కారాలు – మిరియాలు

చిత్రం
మన భోజన రుచులతో పోలిస్తే మిగిలిన చోట్ల బలాదూర్ అనుకోండి. ఇలా ఎందుకు అంటున్నానో మీరే చూడండి . బెంగుళూరు  వచ్చిన పూట మా పిన్ని చేతివంట గొడవ లేదు అన్ని మన రుచులే బాగానే ఉంది. రాత్రి టిఫిన్స్ చూద్దాం . అవి కేటరింగ్ ఇచ్చారు.  చపాతీలు , దద్దోజనం . చపాతిలలోకి బంగాళాదుంప కూర మనకు లానే ఉంటుంది అనుకొన్నాం. తీరా చూస్తే అది మన కూర లాగ గట్టిగా , ముద్దలా కాకుండా పలచగా పాకుతూ ఉంది. సరే ఆకారం ఎలా ఉమ్టేనేం , రుచి చూద్దాం అనుకొంటే మనకి , వాళ్లకు చాలా తేడా ఉంది. ఇక్కడ వాళ్ళు సాధారణంగా మనకులా అంత కారాలు, అవి ఎక్కువ వాడరు . మా తమ్ముడు వాళ్ళు కొంచెము కారాలు ఉండాలి అని చెపితే ఆ మాత్రం కారం వాడారట, అదికూడా మిరియాల కారం. బంగాళా దుంప, కేరెట్, షల్గం అని ఒక దుంప , సోయా గడ్డి (దీనిని సబ్బికే సొప్పు అంటారు), వగైరాలు వాడి కూర చేసారు. . సరే మిరియాల కారం మనకి కొత్త కదా . దానితో పాటు దద్దోజనం, కందిబేడ ( కందిపప్పు) పచ్చడి ఇచ్చాడు. దద్దోజనంలో మిరియాలు పొడి, దానిమ్మగింజలు కూడా కలిపాడు. ఇక్కడ దానిమ్మ గింజలు వలచినవి రెడీమేడ్ అమ్ముతారట. ప్రతిదానిలో వేస్తూ ఉంటారట.        మర్నాడు ఉదయం ఇడ్లి, వడ తో పాటు సాంబార్, కొ

ನಮಸ್ಕಾರ ಸುಭಮುಂಜನೆ

చిత్రం
కంగారు పడకండి ఏమిటీ కన్నడలో పలకరిస్తున్నాను అనుకోకండి . మరి రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండమని పెద్దల న్నా రు కదా ! అంతకన్నా ఏమీ లేదు . మొత్తానికి ఒక గంట లేట్ గా బెంగళూర్ చేరాము . వైట్ ఫీల్డ్ స్టేషన్ లో దిగాము . మా కజిన్ కారులో సత్యసాయి ఆశ్రమం   మీదుగా   బయలుదేరాము .  వాళ్ళు ప్రస్తుతం ఉండేది సంపెగిపురా దారంతా రకరకాల నర్సరీలు , పూల తోటలు , కూరగాయలు , ఆకుకూరల తోటలు ఉన్నాయి . ఇక్కడి నుంచే మన నగరాలకు పువ్వులు సరఫరా అవుతాయి . ప్రస్తుతం సీజన్ కాదు కాబట్టి తోటలు ఖాళీగా ఉన్నాయి . ద్రాక్ష తోటలు కూడా దారిలో కనిపించాయి .   చిన్నచిన్న పల్లెటూర్లు మధ్యనుంచి వెళ్ళాం . దారిలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కనిపించింది .          అందరూ బెంగుళూర్ లో అంతే , బెంగుళూర్ లో అంతే అంటారు కాని ఇక్కడ కూడా హైదరాబాద్ వాతావరణంలానే ఉంది . మా తమ్ముడిని అడిగితే " అబ్బే లేదు అన్నయ్యా ఇది వరకు చాలా చల్లగా ఉండేది . ఇప్పుడే జనం , వాహనాలు పెరిగిపోయి వేడి పెరిగింది

మామూలు..మామూలుగా .....

ఈ రోజు ఏప్రిల్ 23 కదా మామూలుగా ఎప్పటిలాగే ప్రతి ఏడాది లాగే విద్యా సంవత్సరం ఆఖరి రోజు . రేపటి నుంచి వేసవి శలవులు కదా . అందరూ పరీక్షలు అయిపోయిన ఆనందం , రేపటి నుంచి హాయిగా ఆట పాటలతో సంతోషంగా గడపవచ్చనే ఊహలతో పిల్లలందరూ ఎగురుకుంటూ ఇళ్ళకు వెళ్ళి పోయారు . మేము మామూలుగా శలవులలో ఎలక్షన్స్ ఉండటం వలన వాళ్ళకి కావలసిన రూమ్ లు , బెంచీలు , బల్లలు , కుర్చీలు సర్దించి బయలుదేరాము . ఎవరెవరికి ఎక్కడ డ్యూటీలు పడతాయో అనుకొంటూ . మేము మామూలుగా ఏ ఊర్లూ కదలము . కాని ఈ సారి మా కజిన్ గృహాప్రవేశం బెంగుళూరులో ఉండటం వలన ఈ రోజే శేషాద్రి ఎక్స్ ప్రెస్స్ కి బయలుదేరుతున్నాం . స్కూల్ నుంచి వచ్చి అన్నీ సర్దుకొని రెడీ అయాము . మామూలుగా కాకినాడ వాళ్ళు చుట్టాలింటికి వెళ్ళేటప్పుడు సాధారణంగా తీసుకువెళ్ళే " కాకినాడ కాజాలు " తీసుకొచ్చాను . మన బ్లాగ్ కాదండీ తయారుచేసిన కాజాలు . మామూలుగా స్కూల్ కి వెళ్ళినట్లుగానే ఓ గంట ముందు రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము . మామూలుగా లేట్ కాకుండా 5.35 కే బండి బయలుదేరింది . మాకు నలుగురికీ