పోస్ట్‌లు

డిసెంబర్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

వంటింటి చిట్కాలు

1. ఖరీదైన గాజుసామాగ్రి శుభ్రం చేస్తున్నప్పుడు చేతిలో నుంచి జారి          పగి లిపోకుండా ఉండకుండా వాటిని తుండుగుడ్డలో చుట్టి శుభ్రం చేయాలి. 2.  గంధపు చెక్కను పుస్తకాల మధ్య ఉంచితే పుస్తకాలు తినేసే పురుగులు ,   చి మటలు ఆదరికిరావు. 3. గచ్చు నేల కడిగేటప్పుడు ఆ నీటిలో కొంచెం ఉప్పు కలిపితే , ఆరిన తరువాత ఈగలు వాలవు. 4. గాజు సామాగ్రిపై పడిన గీతలు టూత్‌పేస్ట్ తో రుద్దితే సరి. 5. గులాబీ పువ్వుల రేకులు ఊడి పోకుండా ఉండాలంటే పూలు తేగానే ప్రతీ  పువ్వు మధ్యన ఒక చుక్క కొబ్బరి నూనె వేయాలి. 6. చింతపండుతో పాటు కొంచెం ఉప్పు కూడా కలిపి రాగి పాత్రలను తోమినట్లైతే తళ తళా మెరుస్తాయి. 7. చేతికి రానంత చిన్నవై పోయిన టాయిలెట్ సోపు ముక్కలు ఎండ బెట్టి తురిమి సర్ఫ్ వంటి పౌడర్‌లలో కలిపి బట్టలు ఉతికితే కమ్మని సువాసనను అందిస్తాయి.

ఇంటింటి చిట్కాలు

చిత్రం
1. అరటిపండు తొక్కలని ఓవెన్ లో బేక్ చేసి గులాబీ మొక్కల కుండీల్లోని మట్టితో కలిపితే , కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి. 2. కోడిగ్రుడ్డు డొల్లను మెత్తగా పొడిచేసి పాదులకు గానీ , మొక్కలకు గాని వేస్తే మంచి ఎరువులా పని చేస్తుంది. 3. కత్తెరలు గానీ , చాకులు గానీ , పదును పెట్టించుకోవాలన్నప్పుడు , ఒక గరుకు(ఉప్పు)కాగితంతో గట్టిగా రుద్దితే పదునెక్కుతుంది. ఇది ఇంట్లో మనమే చేసుకోవచ్చు. 4. కర్పూరం డబ్బాలో వేసి ఎంత మూతపెట్టినా , కొంత కాలానికి కొంతైనా హరిస్తుంది. నాలుగు మిరియపు గింజలు , నాలుగు బియ్యం గింజలు ఆ డబ్బాలో కర్పూరంతో పాటు వేసి ఉంచితే , కర్పూరం అంత తొందరగా హరించుకుపోదు. 5. కర్ర సామానుల మీద , నేలపై మంచు కురిసినట్లు చెమ్మపడుతూ ఉంటుంది. లీటరు నీటిలో చెంచాడు కడిగే సోడా కలిపి కడగండి. తరువాత శుభ్రమైన నీటితో మరోసారి కడిగి ఆ నేలని ఆరబెడితే మంచిది. 6. కొవ్వొత్తి పత్తికి కాస్త ఉప్పురాస్తే ఎక్కువసేపు కాలుతుంది. కొవ్వొత్తుల వత్తుల అంచుల్ని సగం వరకు కత్తిరిస్తే ఎక్కువసేపు స్థిరంగా , కాంతిగా వెలుగుతాయి.