తెలుగు భాషా చరిత్ర


       తెలుగు భాష పుట్టుక అసలు పేరు ఎలా వచ్చింది. భాష ప్రాచీనత మనం పరిశీలిస్తే దీనికి అనేక పేర్లు ఉన్నాయి తెనుగు, తెనుంగు, తెలుగు, తెలుంగు, ఆంధ్రం మొదలైన పర్యాయపదాలున్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం  " తెలివాహ" అనగా గోదావరి నది అని దీని పరీవాహప్రాంతంలో నివసించేవారు కాబట్టి తెలివాహులు అని అది క్రమంగా తెలుగులు అయిందని అంటారు.  "తేల్" నదీ ప్రాంతం నుంచి వలస వచ్చినవారని అందుకు తేలాంగులు అనే పేరు వచ్చిందని కొందరి అభిప్రాయం.  "తెల్" అనగా తెల్లని అనే విశేషణం. ధవళ వర్ణం కలవారు కాబట్టి తెలగలు అయారని మరికొందరి అభిప్రాయం.
       సంస్కృతంలో "అంధ్ర" అనే శబ్దం " ఆంధ్ర" కు పర్యాయంగా వాడారు. తమిళులు మన భాషను వడగు, వడుగ అని అంటారు. తెలుగు అనేది త్రిలింగ శబ్దం నుంచి వచ్చిందని కొందరంటారు. పోర్చుగీస్ వారు మనని        " జెంతియో" అనీ మన భాషను " టోవాబో" అనే వారట. తెలుగు మధ్య ద్రావిడ భాష. ఐతరేయ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు  " అంధ్రాః పుంత్రాః శబరాః మూతిబా ఇత్యుదంత్యా బహవో భవంతి వైశ్వామిత్రా దస్యూనామ్ భూయిష్టాఃఅన్నారట. ఆర్యావర్త సరిహద్దుల్లో నివసించిన ద్రావిడులు కాని ముండా జాతి వారు కాని కావచ్చును. అందుచేత ఆంధ్రులు అనార్యులైన ద్రావిడజాతికి చెందినవారని తెలుస్తోంది.
తెలుగు వారి చరిత్రను ఇంకా తెలుసుకుందాం నా తదుపరి పోస్ట్ నందు మరి సెలవా !




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం