మీకు తెలుసా ?



సూరంపాలెం తెలుసా మీకు అని ఎవరైనా అడిగారనుకోండి. ఓస్ ఎందుకు తెలీదు. ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఎత్తిపోతల పధకం ఉన్నాయి. పెద్దాపురం దాటాక వస్తుంది. ఊరేనా ? అని అంటారు కదా ! కాని ఊరు పేరు చెపితే జనం హడలిపోయేవారు . మీకు తెలుసా?

       సంగతి ఇప్పుడు కాదు లెండి. ఒక అరవై ఏళ్ళ క్రితం ప్రాంతం అంతా కీకారణ్యంలా ఉండేదిట. పట్టపగలు వెళ్ళడానికి కూడా భయపడేవారట. ఇంతకీ ఊరు పేరు అప్పుడు సూరమ్మ పాలెం దానినే సూరమ్మ దూకుడు అనే వారట. ప్రాంతం గుండా వెళ్ళే బాటసారులను, కిరాణా సామానులు పెద్దాపురంలో కొనుగోలు చేసుకొని రాజానగరం కేసి వెళ్ళే వర్తకులను దారికాచి దోచుకొనే వారట. అందుకే క్షేమంగా సూరమ్మ దూకుడు దాటితే అదే పదివేలు అనుకొనేవారట జనం అప్పట్లో.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం