పోస్ట్‌లు

సెప్టెంబర్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

దానిమ్మ చేసే మేలెంతో

చిత్రం
దానిమ్మ : దీన్లోని గింజలు వ్యర్థాలను తొలగిస్తాయి. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులూ , మధుమేహం లాంటివి రాకుండా కాపాడతాయి. అంతేకాదు త్వరగా వార్థక్యపు ఛాయలు రాకుండా చూస్తాయి. యాంటి ఆక్సి డెంట్  గా పిలువబడే .. .. .. విటమిన్‌ ' ఏ ' , విటమిన్‌ ' సి " , విటమిన్‌ ' ఇ" మరియు సెలీనియం , క్రోమియం , లైకోఫిన్‌ , మొదలగునవి ప్రతిరోజూ ఆహారములో తీసుకుంటే ఫ్రీ-రాడికిల్స్ ఆనే వ్యర్ధపదార్ధాలు మనశరీరమునుండి ఎప్పటికప్పుడు తొలగించబడును.

ఆరోగ్యానికి జామాకు

చిత్రం
రుచిగా ఉండే జామపండ్లు తింటాం. కానీ జామ ఆకు గురించి ఎప్పుడయినా ఆలోచించారా... వాటిల్లో ఉండే పోషకాల గురించి విన్నారా ? ఈ ఆకుల్లో పలు ఆరోగ్య సమస్యలు   రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. నొప్పులూ , వాపులను నివారించే గుణాలూ అధికమే! నీటిని మరిగించి , శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే , జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు అదుపులో ఉంటాయి. దీన్లోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడే వారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి. జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ , దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ , నోటిపూతా తగ్గుతాయి.

వినాయక చవితి శుభాకాంక్షలు

చిత్రం