మన వాళ్ళు " ౦ " లేనా ?


మన భారతదేశం అనాదిగా ప్రాచీన సాంస్కృతిక వారసత్వ సంపద కలిగి ఉంది. అంతే కాదు గణితం, ఖగోళ శాస్త్రం, విజ్ఞానశాస్త్రం, వైద్య శాస్త్రం మొదలైన అనేక రంగాలలో మిగిలిన ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచింది. మానవ నాగరికతలో కూడా ప్రముఖ పాత్ర వహించింది. అయినప్పటికీ నేడు మనం అమెరికా, యూరప్ దేశాలతో పోలిస్తే వెనకబడి ఉండటానికి కారణమేమిటి ? మన దగ్గర విజ్ఞాన భాండాగారం ఉన్నా మనం మన గొప్పతనాన్ని గుర్తించడం గాని దానిని ప్రచారం చేసుకోవడం కాని చేసుకోవడంలో వెనుకబడి ఉన్నామని చెప్పవచ్చును.

       మన దేశం వేదాలకు పుట్టిల్లు. రత్నగర్భ . ఆర్యభట్ట, భాస్కరాచార్య మొదలైన గణిత మేధావులు, చరకుడు, శుశ్రుతుడు మొదలైన వైద్యులు, వరాహమిహిరుడు మొదలైన ఖగోళ శాస్త్రవేత్తలకు పురిటిగడ్డ. అయినా మనం గుర్తించబడటం లేదు. ప్రపంచానికి " " ని అందించి దశాంశమానానికి పునాది వేసినా మనం మాత్రం " " గానే మిగిలిపోతున్నాము. మన దేశ విజ్ఞాన ఖని లోని మేలి ముత్యాలను వెలికి తీయాలి. అందుకే కొందరు గణితమేధావులు, విజ్ఞానశాస్త్రవేత్తలు, వైద్యులు మొదలైన వారి గురించి చర్చించు కుందాం. మరిన్ని వివరాలకు నా తదుపరి పోస్ట్ నందు చదవండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం