కాకి పిల్ల కోకిలకు ముద్దా?



" కాకి పిల్ల కాకికి ముద్దు " అనేది లోకసహజం. అందరూ అనే మాటే. అంటే కాకి పిల్ల మనం చూడటానికి అందంగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ దాని తల్లికి అది ముద్దుగానే ఉంటుంది. మా అబ్బాయి చేసే అల్లరిపనులు మీకు అల్లరిలా ఉంటే నాకు శ్రీకృష్ణుని చిలిపి చేష్టలలా అనిపిస్తాయి. ఇంతకీ ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే ఫిబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఎవరి మాతృభాష వాళ్ళకి గొప్పే. కాదనను ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేల భాషలున్నాయి. అందులో చాలా భాషలు నేడు వాడుకలో లేక విలుప్తమవుతున్నాయి. కారణం మాతృభాషలో మాట్లాడేవారు కొరవడటం, పరభాషా వ్యామోహం పెరగడం కూడా కావచ్చు. పల్లెటూరి పిల్లలు కూడా తల్లిని అమ్మా అనటం లేదు. తల్లులంతా బ్రతికిఉన్నా పాపం మమ్మీలే. మన తీయనైన తేటతెలుగు వెలుగును కోల్పోతోందా? ఆంగ్ల భాషా వ్యామోహ ప్రవాహంలో పడి కొట్టుకుపోతోందా? కోకిలమ్మ లకు కాకి పిల్లే ముద్దు అవుతోందా? అంటే నిజమేననిపిస్తోంది. అసలు మన భాష తెలుగు అని పేరు ఎలా వచ్చింది. తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? ఇవన్నీ తదుపరి పోస్ట్ లో చర్చిద్దాము

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం