కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు....


       కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు కాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము . ఇది పెద్దలు చెప్పిన మాటల్లో ఒకటి. అంటే జీవితంలో కష్ట సుఖాలు అనేవి తప్పవు ఏదో ఒక సందర్భంలో దుఃఖం రాకుండా ఉండదు కదా అనే జీవిత సత్యాన్ని అలా చెప్పారుకాని సముద్రాన్ని చూస్తే అసలు కాళ్ళు తడవకుండా ఉండగలరా ఎవరన్నా? కాకినాడ సముద్ర తీరంలో సూర్యోదయం చూడాలనిపించింది. ఉదయాన్నే బయలుదేరాం.
 అప్పటికి ఇంకా అరుణోదయం కూడా కాలేదు. రోజు మబ్బుగా ఉండటం వల్ల కాబోలు.

కాని జీవన యానం తప్పదు కదా? అప్పుడే వలలు సర్దుకొని చేపల వేటకు బయలుదేరుతున్న గంగపుత్రులను చూడండి.

 అవును రోజు మాఘమాసపు ఆదివారం కదా! చూసారా ఉదయాన్నే సముద్ర స్నానానికి వచ్చిన భక్తురాళ్ళని.
 అదుగో అరుణోదయం.

 అదుగో సూర్యుడు అంటూ తమ్ముడికి చూపిస్తున్న అన్నయ్య.


 ఎవరో ఒకాయన చూడండి సూర్యబింబాన్ని ఒడిసిపట్టాలని చూస్తున్నాడు.

 అదుగో సూర్యుడు నెమ్మదిగా పైకి వచ్చేస్తున్నాడు.

 పడవలు బయలు దేరాయి  దూరతీరాలకో...



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం