అతి సర్వత్ర వర్జయేత్
నేటి పిల్లలు మన కన్నా చాలా ఫాస్ట్ అయి ఉండవచ్చును. తెలివైన వాళ్ళు అయి ఉండవచ్చును. కాని వయసుకు మించిన సాహసాలు చేయడం ప్రాణాంతకం కదూ! అందులొనూ పెద్దవాళ్ళు దగ్గర ఉండి మరీ చేయించడం విచారకరం. ఏదో పాటలు, డాన్సులు, పెయింటింగ్స్, ఇలా వాళ్ళప్రతిభకు పదును పెట్టడం తప్పు కాదు. కాని రోడ్డు మీద విన్యాసాలు వారికీ, ఇతరులకీ కూడా ప్రమాదకరం. ( ఈనాడు దినపత్రికలో వచ్చిన వార్త చూసి నా స్పందన. ఫొటొలు దినపత్రికలోనివే)