వింటర్ ఒలింపిక్స్ 2014

                               

       22 వింటర్ ఒలింపిక్స్  రష్యాలోని సోచి లో ప్రారంభమయ్యాయి. నెల 7 నుండి 23 వరకు జరిగే సంబరాలు పూర్తిగా మంచులో ఆడే ఆటలకి సంబంధించిన పోటీలే ఉంటాయి. నెల 6 ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చేతుల మీదుగా ఫస్ట్ ఒలింపిక్ స్టేడియం లో అంగరంగ వైభోగంగా ప్రారంభమయాయి. వీటితో పాటు  వికలాంగులకు జరిగే వింటర్ పారాలింపిక్స్ కూడా ఇక్కడే జరుగుతాయి. యు.ఎస్.ఎస్.ఆర్ నుంచి విడిపోయాక రష్యాలో ఒలింపిక్స్ జరగటం ఇదే మొదటి సారి. ఆతిధ్యదేశాన్ని 2007  జూలైలో ఎంపిక చేసారు. నల్లసముద్రం తీరాన ఉన్న సోచిలో వేడుకలు జరుగుతాయి. సుమారు 88  దేశాలు పాల్గొనే ఒలింపిక్స్ లో 3000 మంది క్రీడాకారులు పాల్గొనే క్రీడాసంగ్రామంలో స్కీయింగ్, స్కేటింగ్, స్నోబోర్డ్ మొదలైన  రకాల ఆటలలో 98 ఈవెంట్స్ జరుగుతాయి. ఇది ఒలింపిక్స్ సందర్భంగా విడుదల చేసిన స్టాంప్

                                

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం