" సున్న " భావన వేదాలలోనిదేనా?


        " సున్న " అనే భావన వేదకాలం నుంచి మన దేశంలో వాడబడింది. అంతే కాదు ఋణ సంఖ్యలు కూడా వారికి తెలుసును . " సున్న " ను " క్షుద్ర " అనే వారని , ఋణ సంఖ్యలను "అనర్క" అనే వారని అధర్వణ వేదంలో  ఉంది. " సున్న " ను " క్షం " , " వ్యోమ " ,   " పూర్ణ " అనే పదాలతో కూడా సూచించేవారు. అంతే కాక " సున్న " ను మందంగా ఉండే ఒక చుక్కతో సూచించేవారు. వేదసంహితలలో       " సున్న " భావన యొక్క ప్రస్తావన ఉంది.
       వేదాంగాల కాలము క్రీ. పూ 1500 నుండి క్రీ. పూ700 వరకు అని భావిస్తారు. వేదాంగాలు శిక్ష , కల్ప , వ్యాకరణ , నిరుక్త , ఛంద, జ్యోతిష అని ఆరు ఉన్నాయి. ఇవన్నీ కూడా శ్లోకాల రూపంలో ఉన్నాయి. వేదాంగాలలో జ్యోతిషకల్ప అనేవి గణిత సంబంధమైనవి. పూర్ణాంకాలు, భిన్నాలు కూడిక, తీసివేత , హెచ్చవేత, భాగహారం చేయడం గురించి అప్పటివారికి నేర్పు ఉండేదిట.
ఇంకా మరిన్ని విశేషాలకు రేపటి పోస్ట్ లో చదవండి. మీ కాకినాడ కాజా...


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం