పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదా ?


పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదంటారు. అంటే నిజంగా పనికి రాదని కాదు

మన ఇంట్లొ ఉన్న మొక్కని దానిలోని ఔషధగుణాన్ని గుర్తించము

దానిలోని మంచిని పక్కవాళ్ళు గుర్తించి చెపితే అవునా అని ముక్కున 

వేలేసుకుంటాము. వార్త చూడండి. వార్త చూసి ఇది  వ్రాయాలనిపించింది.




 రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారు. అని మనం పాఠాలలో చదువుకున్నాం. అదే పిల్లలకి చెప్తున్నాం కూడా. మరి అంతకు ముందే మన భారతీయుడు ఒకరు విమానాన్ని తయారు చేసారు. ఎగరేసి చూపించారు. అంటే నమ్ముతారా?
       "వేదాలలో అన్నీ ఉన్నాయిష" అని కన్యాశుల్కంలో డైలాగ్ ని వెటకారంగా చెప్పుకోడమే కాని అది ముమ్మాటికీ నిజమే . వేదాలలో అన్నీ ఉన్నాయి. అయితే మనం మామూలుగా చదివేదిగా కాదు. శాస్త్రవిజ్ఞానం అనేది అందరికీ తెలిస్తే దుర్వినియోగం అవుతుందనో ఏమో . నాటి రుషులు వాటిని సంస్కృతంలో శ్లోకాల రూపంలో వ్రాసారు. శ్లోకాల రూపంలో వ్రాయబడిన వేదాలలో మనకు అంతుబట్టని రహస్యాలున్నాయి. నేటి ఆధునిక యంత్రపరికరాల తయారీ మొదలగునవన్నీ నిగూఢంగా వివరించబడి యున్నాయి. అయితే వాటి విలువను గుర్తించక రత్నాలను రాళ్ళుగా వదిలేస్తున్నాము. విదేశీయులు మాత్రం వాటిని సంస్కృతం  నేర్చుకొని  అధ్యయనం చేసి అందులోని రహస్యాలను చేధింఛి పేరు కొట్టేస్తున్నారు
            రుగ్వేదంలో వైమానిక శాస్త్రం గురించి చాలా వివరంగా ఉంది. 

సుమారు వంద విభాగాలుగా, అయిదు వందల సూత్రాలు అన్నీ శ్లోకాల 

రూపంలో వివరించబడియున్నాయి. 

  ( మరిన్ని వివరాలకోసం తదుపరి పోస్ట్ నందు చదవండి) 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం