లవ్ ... ఇష్క్ ... కాదల్ ...
భాష ఏదైనా భావం ఒక్కటే. ప్రేమ.. ప్రేమ విశ్వజనీనమైనది. విశ్వవ్యాప్తమైనది.
తల్లి మీద కొడుకుకి..
కూతురు మీద తల్లికి..
తండ్రి మీద పిల్లలకి..
పిల్లల మీద తండ్రికి..
అక్క మీద చెల్లికి ..
తమ్ముడి మీద అన్నకి..
ఎవరిమీద ఎవరికైనా ఉండే అవ్యాజమైన అభిమానమే ప్రేమ. అయితే ప్రేయసీ ప్రియుల ప్రేమకు ప్రత్యేక స్థానం ఉంది. దానికో ప్రత్యేకమైన్ రోజుంది. అదే ఫిబ్రవరి పద్నాలుగు. ప్రేమికుల దినోత్సవం.
ఇది వయసులోని కుర్రకారుకి పవిత్రదినం.
గులాబీలు... చాక్లెట్ల్... ప్రేమ పావురాలు... లవ్ బర్డ్స్...
గ్రీటింగ్ కార్డ్స్... ప్రేమకానుకలు..
ఇవన్నీ సందడి చేసే పర్వదినం.
ప్రపంచంలో ఎక్కువ గులాబీలు అమ్ముడయ్యే రోజు. ప్రేమికుల రోజు..
అదే వాలైంటైన్స్ డే .
దీనిని ప్రపంచ వ్యాప్తంగా రకరకాల పేర్లతో పండుగగా జరుపుతారు.
ఈ రోజును టర్కీలో " స్వీట్ హార్ట్స్ డే " గా జరుపుకుంటే ,
స్వీడన్ లో " ఆల్ హార్ట్ డే " గా జరుపుకుంటే,
ఫిన్లాండ్ లో " ఫ్రెండ్స్ డే " గా జరుపుతారు. ప్రాచీన రోమ్ దేశంలో జున్ ఫెబ్రువా ( వివాహాన్ని రక్షించే దేవతల రాణి ) పేరు మీద పండువగా జరుపేవారు. ఎక్కువగా దీనిని వసంత కాలం ప్రారంభంగా భావిస్తారు. ఇంతకీ ఈ రోజుకు ఈ ప్రత్యేకత ఏమిటి అంటే చరిత్రలో చాలామంది వాలైంటైన్స్ ఉన్నారు. క్రీ. శ 197 లో రోమ్ కి చెందిన ఒక వాలైంటైన్ అనే అతను మతాచారాలకు బలి ఇవ్వబడ్డాడు. మరొక వాలైంటైన్ క్రీ. శ 269 లో
అరేబియన్ చక్రవర్తిచే చంపబడ్డాడు. వీరి సంస్మరణార్ధం చాలా మంది ఈ రోజును పవిత్రదినంగా భావిస్తారు. అయితే బాగా ప్రాచుర్యం పొందినది. మూడవ వాలైంటైన్ గురించే అంటారు.
పూర్వకాలంలో రోమ్ దేశంలో యుద్దపరిస్తితులు నెలకొన్న సమయంలో రోమన్ చక్రవర్తి క్లాడియస్ దేశంలో యువకులు అందరూ వివాహానికి దూరంగా ఉండాలని, అప్పుడే సైనికులుగా బాగా పనిచేస్తారనే ఉద్దేశంతో వివాహాలను నిషేధించాడు. యువకులందర్నీ బలవంతంగా సైన్యం లోకి తీసుకొనే వారు. ఆ రోజులలో సెయింట్ వాలైంటైన్ అనే యువకుడు రహస్యంగా యువతీ యువకులకు వివాహం జరిపించే వాడు. దానితో అందరికీ ఆరాధ్యనీయుడిగా మారాడు. ముఖ్యంగా ప్రేమికులకు మరీను ఇది చక్రవర్తికి తెలిసింది. చెరసాలలో బందించాడు. ఇతనిని చూడడానికి ఎంతో మంది రోజూ వస్తుండే వారు. అందులో ఆ చెరసాల అధికారి కూతురు కూడా ఉంది. వాళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు. వాలైంటైన్ కు ఉరి శిక్ష విధించారు. చివరిగా తన ప్రేయసికి ఒక ప్రేమ సందేశం పంపుతూ అందులో " ఫ్రం యువర్ వాలైంటైన్ " అని వ్రాసాడు. అతనిని ఉరి తీసిన ఈ రోజును వాలైంటైన్స్ డే గా జరుపుకోవడం ఒక ఆచారమయింది.
మొదట్లో కాగితంపై స్వయంగా వ్రాసిన కవితలు పంపేవారు. తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ మొదలయాయి.
వాటితో పాటు గులాబీలు, రిబ్బన్స్, లేసులతో అలంకరణచేసిన ఎరుపు వస్త్రాలతో తయారయిన హృదయాకారపు పెట్టెలో బహుమతులు ఇవ్వడం మొదలయింది.
ప్రేమ సందేశం పంపడం ఆచారమయింది. ప్రపంచం అంతా ప్రేమదేశం అయింది.
1850 లో వాడిన గ్రీటింగ్ కార్డ్స్.
1900 లో వాడిన గ్రీటింగ్ కార్డ్స్.