నిరాహార దీక్షలు -- నేతి పెసరట్లు

మేము 1972 ప్రాంతంలో అనుకుంటా కాకినాడ దగ్గరలోని తిమ్మాపురంలో ఉండేవాళ్ళం. సమయంలో నేను ఒకటవ తరగతి చదువుతున్నాను. అపుడు జై ఆంధ్ర ఉద్యమం అని గుర్తు. నిరాహార దీక్షలు చేసారు. ఊరి మొదట్లో ఇప్పటిలా అన్ని ఇళ్ళు లేవు. ఇప్పటి పోలీస్ స్టేషను లేదు . అక్కడ స్కూల్, పక్కన ఒక పెద్ద  నంది విగ్రహం ఉండేది. అక్కడ శిబిరం వేసారు. తిమ్మాపురం సైకిళ్ళకు ప్రసిద్ది తెలుసు కదా? అక్కడ కాకినాడ కంటే తక్కువ ఖరీదుకు సైకిలు బిగించి ఇస్తారు. అది ఒక్కటే కాదు , నేతి పెసరట్లకు కూడా ప్రసిద్ది అప్పట్లో మరి. సరే నేను చూసిన విషయం చెపుతున్నా అంతే. ఉదయాన్నే నిరహార దీక్షా పరులు ( కొందరు మాత్రమే నండోయ్) శిబిరం వద్దకు వచ్చి వెనక చేరి రెండు, మూడు నేతి పెసరట్లు తిని అప్పుడు నిరసనదీక్షలో కూర్చొనే వారు.     ( పాపం శమించు గాకమేము చూసి ఇదేదో బాగుంది అని మేమూ కూర్చుంటాము అనే వాళ్ళం. అందరూ అలాటి వాళ్ళని కాదు, కొందరు మాత్రం పాపం అలా వాళ్ళ సహకారాన్ని అందించే వారు. మధ్యన జరుగుతున్న నిరాహార దీక్షలు చూసి నాకు విషయం గుర్తు వచ్చింది
 
              అక్కడ ఉండగానే ’ పాపం పసివాడు ’ సినిమా రిలీజ్ అయింది. హెలికాఫ్టర్ లో పాంప్లెట్స్ విసిరారు. అప్పట్లో అది చాలా వింతైన పబ్లిసిటి మరి అంతే కాదు హెలికాఫ్టర్ చూడటం కూడా కొత్తే మాకు.



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం