పిల్లలకు ఇవి దూరం.




మనం సాధారణంగా పిల్లలను కాఫీ, టీ లు ఇవ్వం. అవి పెద్దవాళ్ళకి మాత్రమే అని, కాఫీలో కెఫీన్ ఉంటుందని. మోతాదు మించిన  కెఫీన్ ఆరోగ్యానికి మంచిది కాదని చాలా మందికి తెలుసు. కాని కెఫీన్ కాఫీలో ఒకటే కాదు ఇంకా చాలా వాటిలో ఉంటుంది తెలుసా?

పిల్లలు ఎక్కువగా తినే చాక్లెట్స్     ( మిల్క్ చాక్లెట్స్ లో ఎక్కువ కాదు ) , ఐస్ టీ, కోల్డ్ కాఫీకోలాలు, హాట్ చాక్లెట్ షేక్స్, సోడాలు, పిల్లలకు ఇచ్చే దగ్గు మందు లలో కూడా కొంచెం ఎక్కువ మోతాదులో కెఫీన్ ఉంటుంది



              తలనొప్పి, నెర్వస్ గా ఉండటం, పొట్టలో అప్ సెట్ గా ఉండటం, నిద్రలేమి, ఏకాగ్రతా లోపం, హార్ట్ బీట్ రేట్ లో మార్పులు, రక్తపోటు పెరగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు పిల్లలలో మరీ ఎక్కువగా ప్రభావం చూపుతాయి. అందుకే పిల్లలను కాఫీ, టీ లతో పాటు సోడాలు, చాక్లెట్స్ మొదలైన వాటికి దూరంగా ఉంచండి.  

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం