పోపుల డబ్బా
ధనియాలు వలన ప్రయోజనాలు:-
మధుమేహం నివారించడంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
మధుమేహం రాకుండా నిరోధించడానికి మరియు ఉన్న వ్యాధిని నయం చేయడానికి ఖచ్చితమైన పరిష్కారం ఇది. ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల సహజ రూపంలో మన తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధనలు,అధ్యయనాలు చెబుతున్నాయి.
టైఫాయిడ్ కు కారణం అయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో
పోరాడుతుందని రుజువయ్యింది. ఆహారం వల్ల కలిగే అనారోగ్యంకు సాల్మొనెల్లా కారణం అవుతుంది . కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ధనియాల పొడిని చేర్చుకోవడం వల్ల ఆహారం వల్ల వచ్చే ఘోరమైన వ్యాధులను నివారించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
* ధనియాల పొడి వల్ల మరో ఉత్తమ ప్రయోజనం, మొటిమలు మరియు మచ్చలను నివారిస్తుంది. మొటిమలు అనేవి టీనేజ్ వారిలో ఒక పీడకలగా ఉంది. ధనియాల పొడి మరియు పసుపు లేదా ధనియాల రసంతో మిక్స్ చేసి మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
* కొలెస్టరాల్ ఆధిక్యత ధనియాల పొడి కొలెస్టరాల్ని నియంత్రణలో
ఉంచుతుంది. రెండు చెంచాలు ధనియాలను నలగ్గొట్టి ఒక గ్లాసు నీళ్లకు చేర్చి మరిగించి చల్లారిన తరువాత వడపోసుకొని తాగాలి. ఇలా రెండుపూటలా కొన్ని నెలలపాటు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
* అంటువ్యాధులు అంటే చికెన్ పాక్స్ వంటివి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి.ఇటువంటి అంటువ్యాధులకు కారణం అయ్యే జర్మ్ (సూక్మక్రిముల) పోరాడటానికి మరియు చంపడానికి ధనియాల్లోని ఔషధగుణాలు అద్భుతంగా సహాయపడుతాయని కొన్ని స్టడీస్ నిరూపించబడ్డాయి .
* ఆరోగ్యకరమైన సుగంధ ద్రవ్యాల్లో ఆరోగ్యకరమైన లక్షణాలున్నాయి. అధిక బహిష్టుస్రావం ఆరు గ్రాముల ధనియాలను అర లీటర్ నీళ్లకు కలిపి సగం నీళ్లు మాత్రం మిగిలేంతవరకూ మరిగించాలి. దీనికి పటిక బెల్లం చేర్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మూడునాలుగు రోజులు చేస్తే బహిష్టు సమయాల్లో జరిగే రక్తస్రావాధిక్య త తగ్గుతుంది. అంతే కాదు, రుతుక్రమం క్రమంగా వచ్చేలా సహాయపడుతుంది.
* ధనియాలు రూపంలోనైనా సరే తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీఆక్సిడెంట్ స్ ను మన శరీరానికి అంధిస్తుంది. దాంతో మన శరీరంలోని ఫ్రీరాడికల్స్ ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ లక్షణాలన్ని కలగలిసి ఉన్నందు వల్లే దీన్ని ఔషధాగుణాలున్న మసాలా దినుసుల్లో టాప్ లో ఉంచారు.