విరాళం.....
నాకు లాటి ఒకాయన దగ్గరకు కొంతమంది చందాలకోసం వచ్చారుట. మేము వృధ్దాశ్రమం కడుతున్నాం, మీకు తోచిన సహాయం చేయండని అడిగారు. దానికి ఆయన మంచిపని చేస్తుంటే నేను మాత్రం సహాయం చేయనా, తప్పకుండా నా వంతు మంచాన పడిన మా అత్తగారు ఉంది తీసుకు వెళ్ళండి . అన్నాడుట. ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే "కాకినాడ కాజా" కు అనుబంధంగా " కాకినాడ కాజా తలంబ్రాలు" అనే బ్లాగ్ ను ప్రారంభించాను. మీకు తోచిన సాయం చేయండి. అంటే మీకు తెలిసిన వధువులు లేదా వరులు ఉన్నట్లైతే kakinadakaja2014@gmail.com కి పూర్తి వివరాలతో పంపండి. నేను kakinadakajatalambralu.blogspot.in బ్లాగ్ లో వాటిని వరుసగా కోడ్ నంబర్స్ ఇచ్చి ప్రచురిస్తాను. దానినుండి నచ్చినవి ఉన్నచో నా మెయిల్ ఐడి కి రాసి వివరాలు పొందవచ్చును. ఇదంతా కేవలం సేవాదృక్పధంతో చేస్తున్నది మాత్రమే. కావున kakinadakajatalambralu.blogspot.in
చూడవలసినదిగా కోరుచున్నాను.
మీరు చేయవలసినది బ్లాగ్ ను చూస్తూ ఉండండి. అందులో కోడ్ నంబర్స్ తో వరులు మరియు వధువుల వివరాలు రోజూ ప్రచురింపబడతాయి. దాని నుండి మీకు నచ్చినవి కోడ్ నంబర్స్ ప్రకారం కోరినట్లైతే మీ మెయిల్ అడ్రస్ నకు పంపబడతాయి. వారితో నేరుగా మీరే సంప్రదించుకోవచ్చును.
చట్టబద్దము కాని హెచ్చరిక: ఈ బ్లాగ్ నందు ప్రచురింపబడు వివరాలు కేవలం మాకు అందిన సమాచారం మాత్రమే. వారి గుణ,రూప,లావణ్యాలకు మా పూచీ లేదు. మీరే తగు విచారణ చేసుకొనగలరు.