మెంతి కూరతో మంచి ఎంతో





మెంతులు, మెంతి ఆకు ఎక్కువగా తీసుకుంటే గర్భస్రావాలు, బిడ్డ నెలలు నిండకుండా పుట్టడం వంటి సమస్యలు రావు. ప్రసవ నొప్పుల తీవ్రత తగ్గుతుంది. బాలింత మెంతి ఎక్కువగా వాడితే పాలు సమృద్ధిగా పడతాయి.
 
మెంతి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రుతుక్రమ సమస్యలు, ఒంటి నుంచి ఆవిరి వచ్చినట్లు ఉండడం వంటి మెనోపాజ్ సమస్యల నుంచి నివారణకు మెంతి బాగా పనిచేస్తుంది. మెంతి ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. కౌమారదశ నుంచి వార్ధక్యం వరకు మహిళలకు అన్ని వయసుల్లోనూ మెంతులు, మెంతి ఆకు వాడకం మంచి ఫలితాన్నిస్తుంది.
 
కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తుంది. గుండె సంబంధిత అనారోగ్యాలను దూరం చేస్తుంది. సోడియం పనితీరును అదుపు చేసి రక్తప్రసరణ వేగాన్ని, గుండె వేగాన్ని నియంత్రిస్తుంది.
 
 రక్తంలో చేరే చక్కెర పరిమాణాన్ని, వేగాన్ని తగ్గిస్తుంది. ఇందులోని అమినో యాసిడ్లు ఇన్సులిన్ ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
 
 జీర్ణక్రియకు ఉపకరిస్తుంది. వ్యర్థాలను తొలగిస్తుంది

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం