కారాలు – మిరియాలు



మన భోజన రుచులతో పోలిస్తే మిగిలిన చోట్ల బలాదూర్ అనుకోండి. ఇలా ఎందుకు అంటున్నానో మీరే చూడండి . బెంగుళూరు  వచ్చిన పూట మా పిన్ని చేతివంట గొడవ లేదు అన్ని మన రుచులే బాగానే ఉంది. రాత్రి టిఫిన్స్ చూద్దాం . అవి కేటరింగ్ ఇచ్చారు.  చపాతీలు , దద్దోజనం . చపాతిలలోకి బంగాళాదుంప కూర మనకు లానే ఉంటుంది అనుకొన్నాం. తీరా చూస్తే అది మన కూర లాగ గట్టిగా , ముద్దలా కాకుండా పలచగా పాకుతూ ఉంది. సరే ఆకారం ఎలా ఉమ్టేనేం , రుచి చూద్దాం అనుకొంటే మనకి , వాళ్లకు చాలా తేడా ఉంది. ఇక్కడ వాళ్ళు సాధారణంగా మనకులా అంత కారాలు, అవి ఎక్కువ వాడరు . మా తమ్ముడు వాళ్ళు కొంచెము కారాలు ఉండాలి అని చెపితే ఆ మాత్రం కారం వాడారట, అదికూడా మిరియాల కారం. బంగాళా దుంప, కేరెట్, షల్గం అని ఒక దుంప , సోయా గడ్డి (దీనిని సబ్బికే సొప్పు అంటారు), వగైరాలు వాడి కూర చేసారు. . సరే మిరియాల కారం మనకి కొత్త కదా . దానితో పాటు దద్దోజనం, కందిబేడ ( కందిపప్పు) పచ్చడి ఇచ్చాడు. దద్దోజనంలో మిరియాలు పొడి, దానిమ్మగింజలు కూడా కలిపాడు. ఇక్కడ దానిమ్మ గింజలు వలచినవి రెడీమేడ్ అమ్ముతారట. ప్రతిదానిలో వేస్తూ ఉంటారట. 

      మర్నాడు ఉదయం ఇడ్లి, వడ తో పాటు సాంబార్, కొత్తిమిర,పుదినా పచ్చడి చేసారు. మనకి సాంబార్ అంటే కప్పులో పోసుకొని పలచగా ఇడ్లి ముక్కలు చేసుకొని అందులో వేసుకొని స్పూనుతో తినేలా ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు మాములుగా అరటి ఆకులో గరిటెతో వేసాడు. అలా గట్టిగా నిలబడేలా ఉంది అన్నమాట .సాంబార్ లో కేరెట్, టమాటాముక్కలతో పాటు మామూలు గుమ్మడి కాయ ముక్కలు కూడా వేసారు.  అన్నింటిలో మిరియం కారమే.


      ఇక భోజనాల దగ్గరకు వస్తే రకరకాల కూరలు చేసారు. మామిడికాయ పప్పు జారుగా ఉంది . పప్పు తక్కువగా వాడతారట . బీన్స్, పెసలు, కొబ్బరికోరు తో కూర , బంగాళాదుంప కూర , పూరీలు , దానిలోకి మిక్స్ద్ వెజిటబుల్ కర్రి , మాములుగా కూర్చొనే సాంబారు ఇచ్చారు. కిరా దోస కాయలతో చేసిన రైతా ఉంది. మొక్కజొన్న గింజలు, దానిమ్మ గింజలు, కొబ్బరికోరు, కేరట్ తురుము కలిపిన జోలే కోసంబరి అని ఒక స్పెషల్ ఐటం కుడా ఉంది. దీనినే మొక్కజొన్న గింజలు బదులు పెసర పప్పు వాడి కూడా చేస్తారట. ఇక్కడ ఎక్కువగా పెసరపప్పు బాగా వాడతారట.  మామిడికాయలతో మన ఉరగాయలాటిది చేసారు కాని మన ఆవకాయలా లేదు.  ఏది అయినా మనకులా స్పైసిగా ఉండవు. ఇక బొబ్బట్లు, సగ్గుబియ్యంతో చేసిన పాయసం మొదలైనవి మామూలే అనుకొండి.  రక రకాల ప్రదేశాలకు వెళ్ళినపుడు అక్కడి రుచులకు కూడా అలవాటు పడాలి కదా మరి. లోకో భిన్నః రుచిః అన్నారు కదా పెద్దలు .   

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం