ఒకటి కావాలంటే మరొకటి వదలాలి.



సుఖార్ధీ త్యజతే విద్యాం, విద్యార్ధీ త్యజతే సుఖం !
సుఖార్ధినఃకుతో విద్యాకుతో విద్యార్ధినః సుఖమ్ !

సాధారణంగా మనం ఏదైతే  లక్ష్యంగా చేసుకొంటామో దానిని సాధించేందుకు కష్టపడాలి. లక్ష్యసాధనలో అనేక సుఖాలను, సౌఖ్యాలను దూరం చేసుకోవాలి. ముఖ్యంగా విద్యార్ధి దశలో మనం చదువు ముఖ్యం కనుక సుఖాలను వదలివేయాలి. కష్టపడి చదివి మంచి ఫలితాలను పొందితే జీవితమంతా సుఖాలను అనుభవించవచ్చును. అదే విద్యార్ధి దశలోనే సుఖాలు కావాలి, కష్టపడలేము అనుకొంటే మనం మంచి ఫలితాలను పొందలేము. ఇది విద్యార్ధికి మాత్రమే కాదు లక్ష్యసాధనలో ఉన్న అందరికీ వర్తిస్తుంది. మనం కావాలన్నదానిని పొందేవరకూ విశ్రమించక, శ్రమిస్తేనే మనం కోరేది దక్కుతుంది

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం