మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....
పిల్లి పిల్లల్ని పెట్టి ఏడు ఇళ్ళు తిప్పుతుంది అంటారు . మీరు ఎప్పుడైనా పిల్లి తన పిల్లల్ని తీసుకువెళ్ళటం చూసారా ? తన నోటితో జాగ్రత్తగా కరిచి పట్టుకొని తీసుకువెళ్తుంది . ఇక్కడ పిల్లిదే బాధ్యత . పిల్లలదేమీ ఉండదు . దీనినే మార్జాల కిశోరన్యాయం అంటారు . అదే మర్కటం అంటే కోతి విషయంలో చూసారా ? అది పిల్లలతో సహా గోడలు ఎక్కి , చెట్టు కొమ్మలు , ఇంటి కప్పులు ఎక్కడికి వెళ్ళినా చిన్నచిన్న పిల్లలు తన తల్లిని వీపునకు గాని , తల్లి పొట్టను కాని గట్టిగా పట్టుకొని ఉంటాయి . ఇక్కడ బాధ్యత తల్లిది కాదు , పిల్లలదే . దీనినే మర్కట కిశోరన్యాయం అంటారు . ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకొంటున్నారు కదా . ఈ రోజులలో పిల్లల్ని మనం పిల్లి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తుందో అంతలా చూస్తున్నాం . చూడండి వాళ్ళకు ఉదయం లేపడం దగ్గరనుంచి , స్నానాలు చేయించడం , టిఫిన్స్ బతిమాలి తినిపించడం , బస్ వచ్చేస్తుందని వాళ్ళని తరుముతూ రెడీ చేయడం అన్నీ తలితండ్రుల బాధ్యతగా తీ...