నేర్చుకోమని....
మనం నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలే కాని ప్రతి వస్తువు నుంచి నేర్చుకోవచ్చును. ఉదాహరణకు మనం ఎక్కడికీ వెళ్ళకుండా మన గదిలో పడుకొని ఉన్నా మనచుట్టూ ఉండే ప్రతి వస్తువు ఏదో ఒక విషయం చెప్తుందని గమనించగలిగితే మనం ఎన్నో నేర్చుకోవచ్చును.
గది పైకప్పు మనకి ఉన్నతమైన లక్ష్యం ఉండాలని,
ఫాన్ ఎప్పుడూ కూల్ గా ఉండాలని,
గడియారం ప్రతి నిమిషం చాలా విలువైనదని,
కిటికీ బయటి ప్రపంచాన్ని చూసి నేర్చుకోమని,
కేలండరు ప్రతి విషయంలో అప్ డేట్ గా ఉండమని,
తలుపు నీ లక్ష్యం చేరాలంటే గట్టి ప్రయత్నంతో సమస్యలను సాధించాలని ( తెరవటం) నేర్పుతాయి.