ఫీనిక్స్ షాపింగ్ మాల్




బెంగుళూరు నగరంలో శనివారం, ఆదివారం వచ్చిందంటే నగరవాసులకు ఆట విడుపు అన్నమాట. ఎక్కువ సాఫ్ట్ వేర్ ఉద్యోగాలలో వారం అంతా తీవ్రమైన ఒత్తిడితో పనిచేసి వారాంతాలలో కనుక సేదతిరకపోతే మళ్ళి వారం అంతా పనిచేసే శక్తి రాదు అనుకొంటా . అలా సేద తీరడానికి పలు షాపింగ్ మాల్స్ ఉపకరిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు కన్నా కూడా ఇవే ఎక్కువ ఆకర్షిస్తున్నాయని చెప్పవచ్చును. ఎందుకు అంటే  ఇక్కడ దుమ్ము, ధూళి  ఉండదు. చక్కగా చల్లగా ఉంటుంది . అన్ని వయస్సుల వాళ్లకి తగిన విధంగా ఉంటుంది. అన్నిరకాల వస్తువులు, దేశ విదేశ బ్రాండ్స్ కంపెనీలు అన్నీ ఒకచోటే దొరుకుతాయి. వినోదం కోసం రకరకాల ఆటలు, పాటలు ఉంటాయి. కాయగూరల దగ్గర నుంచి ఇంటికి కావలసిన సమస్త వస్తువులు దొరకుతాయి. ఇంట్లోకి కావలసిన వస్తువులు  కొనుక్కుపోవచ్చు. ఇక్కడే తినేసి వెళ్లి పోవచ్చును . 
అలాటి షాపింగ్ మాల్స్ లో ఫీనిక్స్ షాపింగ్ సిటీ ఒకటి.  ఆదివారం సాయంత్రం దానికి వెళ్ళాము.అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ లో వందలాది కార్లు, బైక్ లు పార్క్ చేసి ఉన్నాయి.పార్కింగ్ ప్లేస్ రెండు అంతస్తులలో ఉంది.
ఇక్కడ చాలా చోట్ల మూడు, నాలుగు అంతస్తులలో కూడా పార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. కారును తీసుకువెళ్ళి   

ఎస్కలేటర్ లాటి వాటితో పై అంతస్తులలోకి తీసుకువెళ్ళి పార్క్ చేస్తారు.

షాపింగ్ మాల్ లోపలి భాగం చూడండి .






ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం