సూక్తి ముక్తావళి
మనిషి వ్యక్తిత్వాన్ని వృత్తితో కాకుండా అతని వ్యక్తిత్వాన్ని బట్టి అంచనా వేయాలి.
చెడు ఆలోచనలు మనిషి శాంతికీ, సుఖాలకీ, విజయాలకీ బద్దశత్రువులు.
ఉత్తమ జీవితానికి మార్గం విజ్ఞానం, ప్రేరణ, ప్రేమ .
జీవితంలో అన్నీ కోల్పోయినా భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది.
విద్య, వివేకం, పరిజ్ఞానం బావిలో నీళ్ళు లాంటివి. తరగని నిధులు తోడుతున్న కొద్దీ ఊరుతుంటాయి.
ఆవేశాన్ని తగ్గించుకొని, ఊహలలో విహరించడం మానేసిన వ్యక్తి ప్రతి విషయంలోనూ విజయం సాధించగలుగుతాడు .
సమయపాలనే మనిషి సౌశీల్యానికి మచ్చు తునక.
జీవితంలో విజయాన్ని సాధించాలంటే మెట్ల వైపు చూస్తూ కూర్చోకండి. ఆ మెట్లు ఎక్కుతూ పొండి.
నేర్చుకోవడం, మారడం తెలిసినవాడే నిజమైన విద్యావంతుడు.
సంతృప్తిని మించిన ధనం, అసంతృప్తిని మించిన దరిద్రం లేవు.
నీడ లాగా మనవెంట వచ్చేదే నిజమైన కీర్తి.