ನಮಸ್ಕಾರ ಸುಭಮುಂಜನೆ


కంగారు పడకండి ఏమిటీ కన్నడలో పలకరిస్తున్నాను అనుకోకండి. మరి రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండమని పెద్దలన్నారు కదా! అంతకన్నా ఏమీ లేదు . మొత్తానికి ఒక గంట లేట్ గా బెంగళూర్ చేరాము. వైట్ ఫీల్డ్ స్టేషన్ లో దిగాము.

మా కజిన్ కారులో సత్యసాయి ఆశ్రమం మీదుగా బయలుదేరాము


వాళ్ళు ప్రస్తుతం ఉండేది సంపెగిపురా దారంతా రకరకాల నర్సరీలు, పూల తోటలు, కూరగాయలు, ఆకుకూరల తోటలు ఉన్నాయి.ఇక్కడి నుంచే మన నగరాలకు పువ్వులు సరఫరా అవుతాయి.


ప్రస్తుతం సీజన్ కాదు కాబట్టి తోటలు ఖాళీగా ఉన్నాయి. ద్రాక్ష తోటలు కూడా దారిలో కనిపించాయి.
 చిన్నచిన్న పల్లెటూర్లు మధ్యనుంచి వెళ్ళాం. దారిలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కనిపించింది

        అందరూ బెంగుళూర్ లో అంతే, బెంగుళూర్ లో అంతే అంటారు కాని ఇక్కడ కూడా హైదరాబాద్ వాతావరణంలానే ఉంది. మా తమ్ముడిని అడిగితే "అబ్బే లేదు అన్నయ్యా ఇది వరకు చాలా చల్లగా ఉండేది. ఇప్పుడే జనం, వాహనాలు పెరిగిపోయి వేడి పెరిగింది అంతే " అన్నాడు. అది నిజమే లెండి నేను చాలా సంవత్సరాల క్రితం వచ్చాను. అప్పటికి గార్డెన్ సిటీ అన్నందుకు ఊరంతా చెట్లతో పచ్చగా , చల్లగా ఉండేది. ఇప్పుడు మిగిలిన నగరాలలో లాగే కాంక్రీట్ జంగిల్ లాగే ఉంది. ఇంటికి చేరాం. రాత్రి గృహాప్రవేశానికి ఎలక్టానిక్ సిటీ దగ్గర ఉన్న "సెలబ్రిటీ సిగ్నేచర్" అపార్ట్మెంట్ కి వెళ్ళాలి.
ಧನ್ಯವಾದಗಳು



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మార్జాల కిశోర న్యాయం.... మర్కట కిశోర న్యాయం.....

వేదాలలో గణిత ప్రాముఖ్యం