gurthukostunnayi.....
అమ్మ ఒడి ... మొదటి బడి ...
ప్రతి వారూ ఎంత చదివి , ఎంత ఎత్తుకు ఎదిగినా తొలిపలుకులు నేర్చేది అమ్మ ఒడిలోనే కదా. అలనాటి శివాజీ రామాయణ,భాగవతాది ఇతిహాసాలు, సాహస జానపద కధలు , వీరరస ప్రధాన గాధలు తల్లి జిజియా భాయి నుంచి వినటం వలనే కదా మంచి వీరుడిగా ఎదిగి మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడ లాడిమ్చాడు . నేటి బహు భాషా ప్రవీణుడు, రాజకీయ దురంధరినిగా , అపర చాణుక్యుని గా పేరు పొందిన స్వర్గీయ ప్రధాన మంత్రి శ్రీ పి.వీ. నరసింహ రావు గారు కూడా ఢిల్లీకి రాజైనా అమ్మకి బిడ్డే అన్నట్లు తొలి పలుకులు నేర్చింది అమ్మ ఒడిలోనే.
అసలు అమ్మ చెప్తేనే కదా నాన్న అని తెలిసేది. అమ్మ నోట పలికే అత్తా, తాత లతోనే మొదలవుతుంది మన మాటల ప్రయాణం . మిగిలిన జంతుజాలం నుండి మానవులని వేరు చేసేది భాషే కద. అది అనుకరణ ద్వారా శబ్దాలను విని మనం నేర్చుకొంటాం .
అదే విధంగా
పా ఠ శా ల కు వెళ్ళ క ముందే మనకు చాలా శబ్దజాలం పరిచయం అవుతుంది. ఇది అంతా మన చుట్టూ ఉన్న వారందరి నుంచి గ్రహించే నేర్చుకొంటాం. అందులో అమ్మ పాత్ర తక్కువేమీకాదు .
ఇలా చెపుతుంటే గుర్తుకొస్తు న్నాయి నా చిన్ననాటి రోజులు . అపుడు నాకు సుమారు నాలుగు సంవత్సరాలు,మా తమ్ముడికి మూడు సంవత్సరాలు ఉంటాయి ఏమో . రాత్రి పూట నులక మంచం మీద మా ఇద్దరినీ చెరోపక్కా పడుకోబెట్టుకొని అనేక విషయాలు నేర్పేది.
ఆదివారం,సోమవారం ,..... ఇవి ఏడున్నూ వారముల పేర్లు,చైత్రము ,వైశాఖము,..... ఇవన్నీ తెలుగు నెలల పేర్లు, జనవరి, ఫిబ్రవరి, .... ఇవన్నీ ఇంగ్లీష్ నెలల పేర్లు అంటూ వారములు,నెలలూ,నక్షత్రముల పేర్లు రోజూ చెప్పించేది. వాటికి అక్షర రూపం తెలియకపోయినా రోజు వల్లే వేయించడం వలన అడగగానే గడగడ చెప్పేవాళ్లము . అంతే కాదు చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ , శ్రిరాఘవం రఘుకులాన్వయ రత్నదీపం, అంటు అనేక శ్లోకాలు నేర్పేది. నిద్ర లేచిన వెంటనే అరచేతిలో శ్రీరామ అని మూడుసార్లు వేలితో రాసుకొని ,దేముడిని తలచుకొని లేవడం ,సంద్యాసమయంలో దీపం పెట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ శ్లోకం చెప్పించెది. వేమన శతకం , సుమతి శతకం నుంచి అనేక పద్యములు నేర్పెది.
ఒకటి, రెండు,మూడు అంటు అంకెలు నెర్పెది. ఇంతకూ అమ్మ చదివినది అయిదో తరగతి మాత్రమే .కాని అమ్మ వేసిన పునాది జీవితాంతం ఉపయొగప డినది. అందుకే అమ్మ ఒడి మొదటి బడి.

కామెంట్‌లు