పిల్లి పిల్లల్ని పెట్టి ఏడు ఇళ్ళు తిప్పుతుంది అంటారు . మీరు ఎప్పుడైనా పిల్లి తన పిల్లల్ని తీసుకువెళ్ళటం చూసారా ? తన నోటితో జాగ్రత్తగా కరిచి పట్టుకొని తీసుకువెళ్తుంది . ఇక్కడ పిల్లిదే బాధ్యత . పిల్లలదేమీ ఉండదు . దీనినే మార్జాల కిశోరన్యాయం అంటారు . అదే మర్కటం అంటే కోతి విషయంలో చూసారా ? అది పిల్లలతో సహా గోడలు ఎక్కి , చెట్టు కొమ్మలు , ఇంటి కప్పులు ఎక్కడికి వెళ్ళినా చిన్నచిన్న పిల్లలు తన తల్లిని వీపునకు గాని , తల్లి పొట్టను కాని గట్టిగా పట్టుకొని ఉంటాయి . ఇక్కడ బాధ్యత తల్లిది కాదు , పిల్లలదే . దీనినే మర్కట కిశోరన్యాయం అంటారు . ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకొంటున్నారు కదా . ఈ రోజులలో పిల్లల్ని మనం పిల్లి తన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తుందో అంతలా చూస్తున్నాం . చూడండి వాళ్ళకు ఉదయం లేపడం దగ్గరనుంచి , స్నానాలు చేయించడం , టిఫిన్స్ బతిమాలి తినిపించడం , బస్ వచ్చేస్తుందని వాళ్ళని తరుముతూ రెడీ చేయడం అన్నీ తలితండ్రుల బాధ్యతగా తీ...
వేదాలలో గణితశాస్త్రానికి ప్రముఖ స్థానం ఇచ్చారు . ఈ శ్లోకం చూడండి . " యధా శిఖా మయూరాణాం నాగానాం మణయో యధా తద్వద్వేదాంగ శాస్త్రాణం గణితం మూర్ధని స్థితమ్ " . " నెమళ్ళకు శిఖల వలె , పాములకు మణులవలె , వేదాంగ శాస్త్రాలన్నింటికీ శిరస్సున గణితం ఉంది . " అని అర్ధాన్నిచ్చే ఈ శ్లోకం వలన గణితానికి వేదకాలంలో ఉన్న ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చును . ఆనాడు కాలం , ముహుర్తం , వంటి కాలప్రమాణాలు , గ్రహగతులు వాటి ప్రభావం , సూర్య చంద్రులు , నక్షత్రముల స్థితిగతుల గురించి వారికి గల గణిత పరిజ్ఞానం ఎంతో అపారం . ఎప్పుడో రాబోయే సూర్య , చంద్ర గ్రహణాలు , కురవబోయే వర్షాలు , కాయబోయే ఎండలు , అన్నింటినీ ముందే లెక్కించే వారు . వేదకాలంలో యజ్ఞ వాటికల నిర్మాణం , అ...
కాళ్ళు తడవకుండా సముద్రం దాటచ్చు కాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేము . ఇది పెద్దలు చెప్పిన మాటల్లో ఒకటి . అంటే జీవితంలో కష్ట సుఖాలు అనేవి తప్పవు ఏదో ఒక సందర్భంలో దుఃఖం రాకుండా ఉండదు కదా అనే జీవిత సత్యాన్ని అలా చెప్పారు . కాని సముద్రాన్ని చూస్తే అసలు కాళ్ళు తడవకుండా ఉండగలరా ఎవరన్నా ? కాకినాడ సముద్ర తీరంలో సూర్యోదయం చూడాలనిపించింది . ఉదయాన్నే బయలుదేరాం . అప్పటికి ఇంకా అరుణోదయం కూడా కాలేదు . ఈ రోజు మబ్బుగా ఉండటం వల్ల కాబోలు . కాని జీవన యానం తప్పదు కదా ? అప్పుడే వలలు సర్దుకొని చేపల వేటకు బయలుదేరుతున్న గంగపుత్రులను చూడండి . అవును ఈ రోజు మాఘమాసపు ఆదివారం కదా ! చూసారా ఉదయాన్నే సముద్ర స్నానానికి వచ్చిన భక్తురాళ్ళని . అదుగో అరుణోదయం . అదుగో సూర్యుడు అంటూ తమ్ముడికి చూపిస్తున్న అన్నయ్య . ఎవరో ఒకాయన చూడండి సూర్యబింబాన్ని ఒడిసిపట్టాలని చూస్తున్నాడు . అదుగో సూర్యుడు నెమ్మదిగా ...
కామెంట్లు