ద్విముఖం
మనం సాధారణంగా గమనించే ప్రవర్తనారీతులు ఎలా వుంటాయి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం మన మాటలు ఎలా మారిపోతాయి అనేది చర్చించడం కోసం వ్రాస్తున్న పోస్ట్ ఇది. ప్రతిరోజు మన నిత్య జీవితంలో అందరకూ ఎదురయ్యే సంఘటనలే. మనమంతా ఆయా పరిస్తితుల్లో ఎలా ప్రవర్తిస్తామో ఒక సారి గుర్తు చేసుకోండి.
మన అందరిలో
కూడా పైకి కనిపించే మనిషి మాత్రమే కాదు. లోపల దాగిన మరో మనిషి ఉంటాడు. సమయాన్ని బట్టి
బయటకు వస్తాడు. అప్పుడే మనకైతే ఒకలా, ఇతరులకు మరోలా మాట్లాడుతాము. మనలోకి మనం ప్రయాణిస్తే
గుర్తుకొస్తాయి. సందర్బాన్ని బట్టి ఆ ముసుగు వేస్తాం. కావాలంటే ముసుగు తీస్తాం.
స్కూలులో టీచర్
బోర్డ్ మీద ఒక లెక్క చెప్తున్నారు. పొరపాటున కూడికలో తప్పు వేసారు అనుకొందాము. పిల్లలు అరుస్తారు సార్ తప్పు వేసారండి అని. వెంటనే టీచర్ అదేరా మీరు సరిగ్గా గమనిస్తారా లేదా, తప్పు చేస్తే కనిపెడతారా లేదా అని కావాలనే
చేసాను అంటారు. అది సమయస్పూర్తి గా చెప్పినట్లు
బాగానే ఉంది. కాని అదే పిల్లలు తప్పు చేసారు పొరపాటున అనుకోండి. ఇక చూస్కోండి సార్ అందుకొంటారు తిట్ల దండకం. మరి తేడా ఏమిటి. పిల్లలకూ, సార్ కి . అదే ద్విముఖం అనుకొంటాను నేను. ఏమంటారు మీరు.
మీ కాకినాడ కాజా
కామెంట్‌లు