స్నేహమంటే ఇదేరా!
స్నేహమంటే ఇదేరా!
ఇంజనీరింగ్ చేస్తున్న మా అబ్బాయి ఒక రోజు రాత్రి చాలా లేట్ గా వచ్చాడు. లోపలికి వచ్చాక నెమ్మదిగా అడిగాను.
ఏంటి ఇంత లేట్ అయిందని. మా ఫ్రెండ్ ఇంటి దగ్గర చదువుకుని వచ్చాను డాడీ అన్నాడు. సరే ఎంతవరకూ నిజమో చూద్దామని వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వరసగా చేసి కనుక్కున్నాను. వాళ్ళ సమాధానాలు చూడండి.
ఒకటవ వాడు:
ఇక్కడే ఉన్నాడు అంకుల్.
రెండో వాడు : ఇప్పుడే బయలు దేరుతున్నాడు అంకుల్.
మూడవ వాడు : ఇక్కడే ఉన్నాడు అంకుల్, చదువుతున్నాడు ఫోన్ ఇమ్మంటారా అంకుల్.
నాలుగవ వాడు: చెప్పు డాడీ, నేను మా ఫ్రెండ్ ఇంటి దగ్గర ఉన్నాను. రేపు వస్తాను. అన్నాడు.
ఇంక నాకు షాక్. టైడ్ ఏడ్ గుర్తొచ్చి అవాక్కయ్యా!
కామెంట్‌లు